ETV Bharat / sports

ICC T20 Rankings : నెం.1 స్థానంలోనే సూర్య భాయ్​

author img

By

Published : Apr 19, 2023, 7:17 PM IST

Updated : Apr 19, 2023, 9:08 PM IST

ఐసీసీ తాజా టీ 20 ర్యాంకింగ్స్​లను బుధవారం విడుదల చేసింది. టాప్​ బ్యాటర్​గా సూర్యకుమార్​ తన అగ్ర స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంకా ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే....

surya holds 1st rank in t20
surya holds 1st rank in t20

పురుషుల టీ 20 కొత్త ర్యాంకింగ్స్​ను ఐసీసీ బుధవారం​ విడుదల చేసింది. తాజా జాబితాలో.. ప్రస్తుతం ఫామ్​ కోల్పోయి పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న టీమ్​ ఇండియా స్టార్​ బ్యాటర్ సూర్యకుమార్​ యాదవే మళ్లీ మొదటి స్థానంలో (906) నిలిచాడు. అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్​​ ఖాన్​ బౌలర్ల లిస్ట్​లో (710) పాయింట్లతో టాప్​లో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్​ ప్లేయర్​ షకీబల్​ హసన్​ మొదటి స్థానంలో ఉండగా.. భారత ఆటగాడు హార్దిక్​​ పాండ్య రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

బ్యాటింగ్ విభాగంలో 906 పాయింట్లతో సూర్య అగ్ర స్థానంలో ఉండగా.. పాకిస్థాన్​ ఆటగాడు మహమ్మద్​ రిజ్వాన్​ 798 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్​.. రిజ్వాన్​కు మధ్య 100 పాయింట్ల తేడా ఉంది. బాబార్​ అజమ్​ 755 పాయింట్లు, సౌత్​ ఆఫ్రికా ప్లేయర్​ మర్​క్రమ్​ 748 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. ఇక టాప్​ పదిలో మరే ఇతర భారత ఆటగాడికి స్థానం దక్కలేదు. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ​ విరాట్​ కోహ్లీ 15 వ స్థానంలో ఉన్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్​లో అఫ్గానిస్థాన్​ దేశ ఆటగాళ్లు రషీద్​​ 710 పాయింట్లు, ఫారూకీ 692 పాయింట్లుతో వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. అదే దేశానికి చెందిన ముజీబ్​ రహమాన్​ 669 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అయితే టాప్​ పదిలో భారత బౌలర్లకు చోటు దక్కలేదు. లెఫ్ట్​ ఆర్మ్ పేసర్ అర్షదీప్​ సింగ్​ 14 వ స్థానంలో ఉండగా.. భువనేశ్వర్​ 19 వ స్థానానికి పడిపోయాడు.

ఆల్​రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్​ మాజీ కెప్టెన్​ షకీబల్​ హసన్​ 269 పాయింట్లతో ముందుండగా.. టీమ్​ ఇండియా హార్డ్​ హిట్టర్​ హర్దిక్​​ పాండ్య 250 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తంగా మూడు విభాగాల్లో కలిపి భారత్​ నుంచి సూర్య, హర్దిక్​ ఇద్దరు మాత్రమే టీ20 ర్యాంకింగ్స్​లో టాప్​ పదిలో ఉన్నారు.

ఐపీఎల్​లో ఫెయిల్​.. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్​లో ప్రత్యర్థి ఎవరైనా తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడుతూ బౌలర్లను బెంబేలెత్తించే సూర్య... ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్​ సీజన్​లో ఐదు మ్యాచ్​లు ఆడి సూర్య 13.2 సగటుతో కేవలం 66 పరుగులే చేశాడు. ఇక ముందైనా పాత ఫామ్​ను అందుకుని సూర్యభాయ్​ను గుర్తుచేసేలా పరుగుల వరద పారించాలని సూర్య ఫాన్స్​ ఆశిస్తున్నారు.

Last Updated : Apr 19, 2023, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.