Surya Kumar Yadav World Cup 2023 : బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్.. తన ఫీల్డింగ్ స్కిల్స్‌తో అదరగొట్టాడు. దీంతో అతడికి బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సూర్యకు ఈ మెడల్‌ను లెఫ్టార్మ్ త్రోడౌన్ స్పెషలిస్టు కోచ్ నువాన్ సెనెవిరత్నే అందించారు. ఇప్పటికే ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ ఈ గౌరవాన్ని అందుకోగా.. తాజాగా సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఫీల్డర్‌గా ఎంపికయ్యాడు.
ఈసారి స్పెషల్‌గా.. అయితే ప్రతి మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లో అనౌన్స్ చేస్తారు. కానీ, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం గ్రౌండ్లో విజేతను ప్రకటించారు. ఈసారి అవార్డు విన్నర్‌ను బిగ్ స్ట్రీన్‌పై రివీల్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డు కోసం రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ ముగ్గురి మధ్య పోటి ఏర్పడింది. వీరి పేర్లను స్క్రీన్‌పై చూపించారు. కానీ, చివరికి సూర్యనే ఈ అవార్డు వరించింది.
అయితే టోర్నీలో ఏ జట్టులో కూడా ఇలాంటి అవార్డులు లేవు. కేవలం టీమ్ఇండియాలోనే కోచ్ దిలీప్.. జట్టు సభ్యులకు అవార్డుల ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ అవార్డుల ఐడియాపై దిలీప్ మాట్లాడారు." ఈ అవార్డు మైదానంలో సభ్యుల ఆటతీరును తెలియజేస్తుంది. ఇన్నింగ్స్‌లో ఉన్న 300 బంతులను ప్లేయర్ ఎలా హ్యాండిల్ చేశాడన్నదే ముఖ్యం. ఇది ఒక్క అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించింది కాదు. నాలుగు నెలల నుంచి మేము జట్టులో దీనిని అమలు చేస్తున్నాం. కానీ, ఇప్పుడే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాం" అని అన్నారు.
-
When the "Decision is pending" & you get the groundsmen for the BIG reveal 👌🏻🫡
— BCCI (@BCCI) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Heartwarming & innovative from #TeamIndia in this edition of the Best fielder award🏅 #CWC23 | #MenInBlue | #INDvNED
WATCH 🎥🔽 - By @28anand
">When the "Decision is pending" & you get the groundsmen for the BIG reveal 👌🏻🫡
— BCCI (@BCCI) November 13, 2023
Heartwarming & innovative from #TeamIndia in this edition of the Best fielder award🏅 #CWC23 | #MenInBlue | #INDvNED
WATCH 🎥🔽 - By @28anandWhen the "Decision is pending" & you get the groundsmen for the BIG reveal 👌🏻🫡
— BCCI (@BCCI) November 13, 2023
Heartwarming & innovative from #TeamIndia in this edition of the Best fielder award🏅 #CWC23 | #MenInBlue | #INDvNED
WATCH 🎥🔽 - By @28anand
Ind vs Ned World Cup 2023 : నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో దిగిన నెదర్లాండ్స్.. 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చిసిన సూర్యకుమార్ యాదవ్.. 2 పరుగులే చేయగలిగాడు. కానీ, ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసి.. 17 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక భారత బౌలర్లలో బూమ్రా, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, జడేజా తలో రెండు వికెట్లు తీయగా.. స్టార్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.
'బెస్ట్ ఫీల్డర్' గా శ్రేయస్ - మాస్టర్ బ్లాస్టర్ అనౌన్స్మెంట్