Surya Kumar Yadav Mumbai Video : 2023 వన్టే వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి లేకుండా దూసుకెళ్తోంది. నవంబర్ 2న శ్రీలంకతో జరిగే మ్యాచ్ కోసం టీమ్ఇండియా ముంబయికి చేరుకుంది. ఈ క్రమంలో భారత జట్టు గురించి ముంబయి అభిమానులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాడు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఎవరూ గుర్తుపట్టకుండా ఫుల్ షర్ట్, క్యాప్, మాస్క్, కళ్లద్దాలు ధరించి ముంబయి రోడ్లపై తిరిగాడు. పాదచారులను టీమ్ఇండియా గురించి పలు ప్రశ్నలు అడుగుతూ సందడి చేశాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అభిమాని సమాధానానికి సూర్య షాక్!
ముంబయి వాసులకు ప్రశ్నలు సంధించడానికి బీచ్ ప్రాంతానికి వెళ్లాడు సూర్యకుమార్. ముంబయిలో ఏది ఫేమస్? మీ ఫేవరెట్ క్రికెట్ ఎవరు? దీంతో పాటు టీమ్ఇండియాలో మీకు ఏ ప్లేయర్ ఎక్కువ ఇష్టం? అంటూ పలువురిని ప్రశ్నించాడు. అయితే మాస్క్, కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల సూర్యను ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో ఓ అభిమాని.. సూర్యకుమార్ తన ఆటను మెరుగుపరుచుకోవాలని అతడితోనే చెప్పి షాక్ ఇచ్చాడు.
-
Presenting Suryakumar Yadav in a never seen before avatar 😲🤯
— BCCI (@BCCI) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
What's our Mr. 360 doing on the streets of Marine Drive 🌊
Shoutout 👋🏻 if you were on SURYA CAM last evening 🤭#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL
WATCH 🎥🔽 - By @28anand
">Presenting Suryakumar Yadav in a never seen before avatar 😲🤯
— BCCI (@BCCI) November 1, 2023
What's our Mr. 360 doing on the streets of Marine Drive 🌊
Shoutout 👋🏻 if you were on SURYA CAM last evening 🤭#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL
WATCH 🎥🔽 - By @28anandPresenting Suryakumar Yadav in a never seen before avatar 😲🤯
— BCCI (@BCCI) November 1, 2023
What's our Mr. 360 doing on the streets of Marine Drive 🌊
Shoutout 👋🏻 if you were on SURYA CAM last evening 🤭#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL
WATCH 🎥🔽 - By @28anand
'బ్యాటింగ్ ఆర్డర్లో సూర్య కుమార్ యాదవ్ మరింత ముందుకు రావాలి. అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ లభించడం లేదు. సూర్య ఇంకా బ్యాటింగ్ చేయాలి. అతడు ఆటను ఇంకా మెరుగుపరుచుకోవాలి, అప్‍గ్రేడ్ చేసుకోవాలి' అని ఆ ఫ్యాన్.. నేరుగా కెమెరామెన్ వేషంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్‍కే చెప్పాడు. అయితే ఆ సమయంలో తనకు నవ్వు వచ్చినా ఆపుకున్నానని సూర్య ఆ తర్వాత తెలిపాడు. అలా ప్రశ్నలు ఆడగడం పూర్తయ్యాక.. తానెవరో మాస్క్ తీసి చెప్పి అభిమానులను షాక్‌కు గురిచేశాడు సూర్య. అనంతరం వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగి మళ్లీ హోటల్‍కు వెళ్లిపోయాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వరల్డ్‌కప్‌లో సూర్యకుమార్ యాదవ్ రెండు మ్యాచ్‌లు ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులకే అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు.
క్రికెట్‌కు స్టార్ బౌలర్ గుడ్‌బై వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్