ETV Bharat / sports

'కరీమ్.. ఆ విషయంలో బీసీసీఐ వెరీ సీరియస్' - గంగూలీపై సాబా కరీమ్ వ్యాఖ్యలు

ఆటగాళ్ల ఫిట్​నెస్​ విషయంలో బీసీసీఐ కచ్చితమైన నిబంధనలు పాటిస్తుందని బోర్డు సీనియర్​ అధికారి ఒకరు పేర్కొన్నారు. క్రికెటర్ల గాయాలను ఫిజియోలు గుర్తించడం లేదన్న మాజీ క్రికెటర్ కరీమ్​ వ్యాఖ్యలపై ఆ అధికారి స్పందించారు. కరీమ్ వ్యాఖ్యలు గంగూలీ, గిల్​ను అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు.

bcci, saba karim
బీసీసీఐ, సాబా కరీమ్
author img

By

Published : Jul 5, 2021, 2:26 PM IST

టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బోర్డు కచ్చితమైన నిబంధనలు పాటిస్తోందని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు. అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. క్రికెటర్లు గాయాలను దాస్తున్నారని, ఫిజియోలు వాటిని గుర్తించడం లేదన్న మాజీ క్రికెటర్​ సాబా కరీమ్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఇది దాదా, గిల్‌ను అవమానించడమే అవుతుందని విమర్శించారు.

"సాబా కరీమ్ వ్యాఖ్యలు సౌరభ్​ గంగూలీ నాయకత్వాన్ని ప్రశ్నించినట్లున్నాయి. ఆటగాళ్ల ఎంపిక, ఫిట్‌నెస్‌ అంశాల్లో నిబంధనలు పాటించడంపై దాదా సీరియస్‌గా ఉంటారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు. ఆటగాడిగా శుభ్‌మన్‌ గిల్‌, నాయకుడిగా దాదా నిజాయతీని అనుమానించడమే అవుతుంది" అని బీసీసీఐ అధికారి అన్నారు.

"ఇది కరీమ్‌ ఏడుపే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే కొంతకాలం క్రితం వరకు ఆయన బీసీసీఐలో పనిచేశారు. ఒక ఆటగాడి ఫిట్‌నెస్‌ను ఎలా పరీక్షిస్తారో, ఆ ప్రక్రియ ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఈ రోజుల్లో ఆటగాళ్లు గాయాలను దాచే అవకాశమే లేదు. బహుశా అతడు క్రికెటర్‌ లేదా సెలక్టర్‌గా ఉన్నప్పుడు అలా జరిగిందేమో నాకు తెలియదు. కానీ అతడి మాటలు మాత్రం బాధాకరం" అని ఆ అధికారి తెలిపారు.

"ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు శుభ్‌మన్‌కు ఎలాంటి గాయం కాలేదు. బహుశా న్యూజిలాండ్ మ్యాచ్‌ అయ్యాక కావొచ్చు. ఆ కుర్రాడు ఎంతో నిజాయితీపరుడు. టీమ్‌ఇండియా తరఫున టెస్టు, ఇతర ఫార్మాట్లలో ఆడిన సాబా కరీమ్‌ ఇలా మాట్లాడటం మాత్రం దురదృష్టకరం" అని విమర్శించారు.

శుభ్‌మన్‌ గిల్‌ గాయాన్ని దాచడం ఆశ్చర్యపరిచిందని సాబా కరీమ్‌ మీడియాతో అన్నారు. అతడు సుదీర్ఘ కాలంగా టీమ్‌ఇండియాతో ప్రయాణిస్తున్నా ఫిజియోలు, వైద్య సిబ్బంది అతడి గాయాన్ని గుర్తించలేకపోయారని విమర్శించారు. ఈ విషయం ముందే ఎందుకు తెలియలేదో ఆశ్చర్య పరిచిందన్నారు. ఆయన వ్యాఖ్యలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి.

ఇదీ చదవండి: 'శిఖర్​.. అలా అయితేనే పొట్టి కప్​లో చోటు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.