Suriya ISPL T10 League : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టీ-10 టోర్నీలో భాగస్వామ్యం అయ్యేందుకు స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఇదొక ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడుతుందని భావిస్తున్న హీరోలు, టోర్నీలో ఆయా ఫ్రాంజైజీలకు యజమానులుగా మారుతున్నారు. స్టార్ హీరోలు రామ్‌చరణ్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్ టోర్నీలో ఇప్పటికే ఆయా జట్లను కొనుగోలు చేయగా తాజాగా ఈ లిస్ట్‌లో కోలీవుడ్ హీరో సూర్య చేరారు.
హీరో సూర్య ఐఎస్పీఎల్ టీ10లో 'టీమ్ చెన్నై' (తమిళనాడు) జట్టును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. 'నమస్కారం చెన్నై! ఐఎస్పీఎల్ టీ10లో మన టీమ్ చెన్నై జట్టును కొనుగోలు చేశానని తెలియజేస్తున్నా. మనం అందరం కలిసి క్రీడా స్ఫూర్తిని, క్రికెట్ వారసత్వాన్ని క్రియేట్ చేద్దాం' అని ట్వీట్ చేశారు. ఇక లీగ్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు ఓ లింక్‌ను కూడా ఆయన యాడ్ చేశారు.
-
Vanakkam Chennai! I am beyond electrified to announce the ownership of our Team Chennai in ISPLT10. To all the cricket enthusiasts, let's create a legacy of sportsmanship, resilience, and cricketing excellence together.
— Suriya Sivakumar (@Suriya_offl) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Register now at https://t.co/2igPXtyl29!🏏#ISPL @ispl_t10… pic.twitter.com/fHekRfYx0i
">Vanakkam Chennai! I am beyond electrified to announce the ownership of our Team Chennai in ISPLT10. To all the cricket enthusiasts, let's create a legacy of sportsmanship, resilience, and cricketing excellence together.
— Suriya Sivakumar (@Suriya_offl) December 27, 2023
Register now at https://t.co/2igPXtyl29!🏏#ISPL @ispl_t10… pic.twitter.com/fHekRfYx0iVanakkam Chennai! I am beyond electrified to announce the ownership of our Team Chennai in ISPLT10. To all the cricket enthusiasts, let's create a legacy of sportsmanship, resilience, and cricketing excellence together.
— Suriya Sivakumar (@Suriya_offl) December 27, 2023
Register now at https://t.co/2igPXtyl29!🏏#ISPL @ispl_t10… pic.twitter.com/fHekRfYx0i
ఈ టోర్నీలో హీరోలు కొనుగోలు చేసిన జట్లు
- రామ్‌చరణ్- హైదరాబాద్
- అమితాబ్ బచ్చన్- ముంబయి
- హృతిక రోషన్- శ్రీ నగర్
- సూర్య- చెన్నై
ISPL 2023 : ఈ టోర్నీ తొలి ఎడిషన్ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు జరగనుంది. ఈ టోర్నీలో ఆరు మహానగరాలు హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, శ్రీ నగర్, బెంగళూరు, చెన్నై టీమ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. లీగ్‌లో ప్రతీ మ్యాచ్ 10 ఓవర్ల ఫార్మాట్లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లను టెన్నిస్ బాల్‌తో నిర్వహిస్తారు. అయితే టోర్నీలో పాల్గొనాలనుకునే వారు ముందుగా ISPL వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అభ్యర్థులకు ఎంట్రీ పాస్‌లు జారీ చేసి, ట్రయల్స్ పోటీలు నిర్వహిస్తారు. ఈ ట్రయల్స్‌లో అత్యత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లు టోర్నీలో ఆడేందుకు అర్హత సాధిస్తారు. ఇక ఈ టోర్నీకి ప్లేయర్ల ఎంపిక మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే నేతృత్వంలో జరగనుంది. టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ టోర్నీకి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
తెలుగు కుర్రాళ్లకు గోల్డెన్ ఛాన్స్- చరణ్ క్రికెట్ టీమ్‌లోకి ఆహ్వానం- రిజిస్టర్ చేసుకోండిలా!
గల్లీ క్రికెటర్లకు మహత్తర అవకాశం- మార్చిలో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, ప్లేయర్ల ఎంపిక అప్పుడే!