Suresh Raina Birthday : టీమ్ఇండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా.. 2005లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి, 13 ఏళ్లుకు పైగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో అనేక రికార్డులు కొల్లగొట్టి తక్కువ కాలంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌ల్లో అనేక సీజన్లు నిలకడగా రాణించి.. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందాడు సురేశ్ రైనా. సోమవారం (నవంబర్ 27)న రైనా బర్త్‌డే సందర్భంగా అతడి కెరీర్‌లోని కొన్ని విశేషాలు..
మెరుపు బ్యాటింగ్, నాణ్యమైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్‌తో రైనా మైదానంలో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశేవాడు. బ్యాటింగ్‌లో రైనా సిగ్నేచర్ షాట్'ఇన్సైడ్ ఔట్' కు అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. 2011లో వరల్డ్‌కప్ నెగ్గిన టీమ్ఇండియా జట్టులో రైనా సభ్యుడు కూడా. అయితే రైనా ఆ మెగాటోర్నీలో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడని.. కానీ, వాటి గురించి ఎవరూ మాట్లాడుకోరని స్పిన్నర్ రవిచంద్రన్ గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పాడు.
"2011 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్, మొహాలీలో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. రైనా వచ్చి గేమ్‌ను మా వైపు మలిచాడు. ఆ ప్రపంచకప్ గురించి చర్చకు వస్తే.. మనం యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, సచిన్ తెందూల్కర్ ఇన్నింగ్స్‌లు.. బౌండరీలతో స్కోర్ బోర్డును ప్రారంభించే వీరేంద్ర సేహ్వాగ్ గురించి మాట్లాడుకుంటాం. కానీ, ఆ వరల్డ్‌కప్‌లో సురేశ్ రైనా పోరాటం మర్చిపోకూడదు" అని అశ్విన్ అన్నాడు. కాగా, 2011 ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై రైనా 28 బంతుల్లో 34*, సెమీస్‌లో పాకిస్థాన్‌పై 39 బంతుల్లో 36*పరుగులతో రాణించాడు.
-
Most Underrated Player #SureshRaina pic.twitter.com/cTV3fwCTxV
— Ꮇᴏʜᴀɴ 🦁NBK🦁 (@CBNBK6) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Most Underrated Player #SureshRaina pic.twitter.com/cTV3fwCTxV
— Ꮇᴏʜᴀɴ 🦁NBK🦁 (@CBNBK6) November 20, 2023Most Underrated Player #SureshRaina pic.twitter.com/cTV3fwCTxV
— Ꮇᴏʜᴀɴ 🦁NBK🦁 (@CBNBK6) November 20, 2023
రైనా కెరీర్లో మరిన్ని ఘనతలు..
- టీమ్ఇండియాకు టీ20ల్లో చిన్న వయసులో కెప్టెన్సీ చేసిన ప్లేయర్ రైనా. అతడు 23 ఏళ్లకే సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు.
- ఐపీఎల్లో 3000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి బ్యాటర్ రైనా. ఐపీఎల్లో రైనా అత్యంత నిలకడ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
- ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ రైనా. అతడు 171 క్యాచ్‌లు పట్టాడు. ఐపీఎల్లో 100 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాటర్ కూడా రైనా.
- అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన తొలి టీమ్ఇండియా ప్లేయర్ రైనా.
-
Seeing back the moments another one hero was in the Chennai super kings was
— ⚡Jenifer 💜 (@jeniferjaiii) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Suresh Raina 💜💜💜
We miss u lot chinna thala @ImRaina#HBDMrIPL pic.twitter.com/ZIgMIFsDMf
">Seeing back the moments another one hero was in the Chennai super kings was
— ⚡Jenifer 💜 (@jeniferjaiii) November 27, 2023
Suresh Raina 💜💜💜
We miss u lot chinna thala @ImRaina#HBDMrIPL pic.twitter.com/ZIgMIFsDMfSeeing back the moments another one hero was in the Chennai super kings was
— ⚡Jenifer 💜 (@jeniferjaiii) November 27, 2023
Suresh Raina 💜💜💜
We miss u lot chinna thala @ImRaina#HBDMrIPL pic.twitter.com/ZIgMIFsDMf
-
రిటైర్మెంట్లోనూ వీడని ఫ్రెండ్షిప్.. సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు..