Sunrisers Hyderabad New Head Coach 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌కు అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు.. తమ హెడ్ కోచ్‌లను మార్చగా.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ హెడ్ కోచ్‌ను మార్చేసింది. న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డేనియల్ వెట్టోరిని నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారాపై వేటు వేస్తూ.. ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
-
🚨Announcement🚨
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡
Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86
">🚨Announcement🚨
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023
Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡
Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86🚨Announcement🚨
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023
Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡
Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86
Daniel Vettori Coaching Career : డేనియల్ వెట్టోరి గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అదే ఆర్సీబీ జట్టుకు 2014 - 2018 మధ్య సీజన్లలో హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. వెట్టోరి నేతృత్వంలో ఆర్సీబీ 2015లో ప్లేఆఫ్స్ చేరగా.. 2016లో ఫైనల్స్ దాకా వెళ్లింది. అయితే ఈ రెండు సీజన్ ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడింది. కాగా ప్రస్తుతం వెట్టోరి ఆస్ట్రేలియా పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వెట్టోరి బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బర్బాడోస్ రాయల్స్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
-
As our 2 year association with Brian Lara comes to an end, we bid adieu to him 🧡
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you for the contributions to the Sunrisers. We wish you all the best for your future endeavours 🙌 pic.twitter.com/nEp95pNznT
">As our 2 year association with Brian Lara comes to an end, we bid adieu to him 🧡
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023
Thank you for the contributions to the Sunrisers. We wish you all the best for your future endeavours 🙌 pic.twitter.com/nEp95pNznTAs our 2 year association with Brian Lara comes to an end, we bid adieu to him 🧡
— SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023
Thank you for the contributions to the Sunrisers. We wish you all the best for your future endeavours 🙌 pic.twitter.com/nEp95pNznT
ఇక ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్, సలహాదారుడిగా బ్రియన్ లారా పని చేశాడు. కాగా గత ఆరేళ్లలో సన్‌రైజర్స్‌కు నలుగురు కోచ్‌లు నియమితులయ్యారు. వెట్టోరి కంటే ముందు సన్‌రైజర్స్‌కు.. టామ్ మూడీ (2019&2022), ట్రివోర్ బెయిలిస్ (2020&2021), బ్రియన్ లారా (2023) హెడ్కోచ్లుగా పనిచేశారు. ఐపీఎల్లో 2016 -2020 మధ్య ప్రతి సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్.. 2021 నుంచి 2023 వరకు కేవలం 13 విజయాలనే నమోదు చేసి.. 29 మ్యాచ్‌ల్లో ఓడింది. 2023 సీజన్లో లారా నేతృత్వంలో సన్‌రైజర్స్.. 14 మ్యాచ్‌లు ఆడగా.. అందులో కేవలం నాలుగే విజయాలను అందుకుని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది.
కావ్య పాప బాధ చూసి తట్టుకోలేకపోతున్నా : రజనీకాంత్ వైరల్ కామెంట్స్
Sunrisers Kavya Maran : కావ్య పాప ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?