ETV Bharat / sports

సునీల్ నరైన్ షాకింగ్ డెసిషన్ - ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై - సునీల్ నరైన్ సూపర్ ఓవర్ మెయిడెన్

Sunil Narine Retirement : వెస్టిండీస్ స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ ఆదివారం అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

Sunil Narine Retirement
Sunil Narine Retirement
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 7:56 PM IST

Updated : Nov 5, 2023, 10:58 PM IST

Sunil Narine Retirement : వెస్టిండీస్ స్టార్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని స్వయంగా నరైన్ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించాడు. "నా ఫ్యాన్స్​కు, నన్ను ఆదరించేవారికి.. నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నానని తెలియజేస్తున్నాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతుడ్ని" అని నరైన్ అన్నాడు.

"నేను వెస్టిండీస్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి నాలుగేళ్లు అవుతోంది. ఈరోజు అంతర్జాతీయ క్రికెట్​కు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టం. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు, మా జట్టు కోచ్​ స్టాఫ్​, నా సహచర ఆటగాళ్లకు అందరికీ కృతజ్ఞతలు. నా సొంత జట్టైన ట్రినిడాడ్ అండ్ టొబాగోకు డొమెస్టిక్​ క్రికెట్​లో ప్రాతినిధ్యం వహించడం కూడా నా అదృష్టం. నా కెరీర్​లో సపోర్ట్​ చేసిన వారందరికీ ధన్యవాదాలు" అని నరైన్ అన్నాడు.

Sunil Narine International Stats : 35 ఏళ్ల నరైన్.. తన కెరీర్​లో అంతర్జాతీయంగా 65 వన్డే, 51 టీ20, 6 టెస్టు మ్యాచ్​లు ఆడాడు. అన్ని ఫార్మాట్​లలో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు. నాలుగేళ్ల కిందట చివరిసారిగా.. అయితే నరైన్ చివరి సారిగా జాతీయ జట్టుకు నాలుగేళ్ల కిందట ప్రాతినిధ్యం వహించాడు. అతడు 2019 లో భారత్​తో జరిగిన టీ20 మ్యాచ్​లో ఆడాడు. ఈ మ్యాచ్​లో బౌలింగ్ చేసిన నరైన్ ఒక్క వికెట్ దక్కించుకోలేదు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పిన నరైన్.. డొమెస్టిక్ లీగ్​లలో యధావిథిగా ఆడనున్నాడు.

ఐపీఎల్​తో గుర్తింపు.. సునీల్ నరైన్​కు అంతర్జాతీయ లెవెల్​లో ఐపీఎల్​తోనే గుర్తింపు లభించింది. ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ తరఫున ఆడిన నరైన్.. జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఐపీఎల్​ మొత్తంగా 162 మ్యాచ్​ల్లో నరైన్.. 1046 పరుగులు చేసి, 163 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచంలోనే తొలి బౌలర్​గా రికార్డు.. నరైన్ ప్రపంచంలోనే టీ20 క్రికెట్​లో ఏ బౌలర్​కు సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. అతడు 2014 కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​ రెడ్ స్టీల్ - గుయానా అమెజాన్ వారియర్స్ మ్యాచ్​లో.. సూపర్​ ఓవర్​ను మెయిడెన్​గా మలిచి చరిత్ర సృష్టించాడు.

Red Card In Cricket : క్రికెట్​లో రెడ్​కార్డ్ రూల్.. నిషేధం ఎదుర్కొన్న తొలి ప్లేయర్ అతడే

షారుక్ ఖాన్, సునీల్​ నరైన్​ ఊచకోత.. టీ20ల్లో 'బ్లాస్ట్'​ పెర్​ఫార్మెన్స్​!

Last Updated : Nov 5, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.