ETV Bharat / sports

క్రికెట్ అకాడమీ కోసం ప్లాట్.. 33ఏళ్ల తర్వాత రిటర్న్ ఇచ్చిన గావస్కర్ - గావస్కర్ సచిన్ అకాడమీ

Sunil Gavaskar Mumbai plot: క్రికెట్ అకాడమీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్​ను 33 ఏళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్. అకాడమీ నెలకొల్పాలన్న ప్రయత్నాలు విఫలం కావడం వల్ల.. ఠాక్రే సర్కారు అభ్యర్థన మేరకు ప్లాట్​ను రిటర్న్ ఇచ్చారు.

Sunil Gavaskar cricket academy
Sunil Gavaskar returns Mumbai plot
author img

By

Published : May 4, 2022, 2:31 PM IST

Sunil Gavaskar Mumbai plot: మూడు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్లాట్​ను టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్​ తిరిగి ఇచ్చేశారు. క్రికెట్ అకాడమీ నెలకొల్పేందుకు మహారాష్ట్ర హౌజింగ్ ఏజెన్సీ(ఎంహెచ్ఏడీఏ) ముంబయిలోని బాంద్రాలో 33 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని కేటాయించింది. అప్పటి నుంచి ఇది నిరుపయోగంగానే ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హౌజింగ్ మినిస్టర్ జితేంద్ర అవ్హాద్.. గతేడాది సునీల్ గావస్కర్​కు లేఖ రాశారు. బాంద్రాలో కేటాయించిన ప్లాట్​ నిరుపయోగంగా పడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్లాట్​ను తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.

Sunil Gavaskar cricket academy: అయితే, క్రికెట్ అకాడమీ నెలకొల్పాలని సునీల్ గావస్కర్ ఇదివరకే పలు ప్రయత్నాలు చేశారు. సచిన్ తెందూల్కర్​తో కలిసి అకాడమీ అభివృద్ధి కోసం ఓ ప్లాన్​ను రూపొందించారు. ఈ మేరకు ఠాక్రే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. దురదృష్టవశాత్తు అవేవీ ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే గావస్కర్​కు మంత్రి జితేంద్ర లేఖ రాశారు. ఎనిమిది నెలల చర్చల అనంతరం ప్లాట్​ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. తాను క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయలేనని లేఖలో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్.. టీ20ల్లో మనమే టాప్.. టెస్టులు, వన్డేల్లో ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.