Sunil gavaskar news: టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవడంపై మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ పూర్తయ్యాక టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన సందర్భంగా గావస్కర్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఆటగాళ్లు టీమ్ఇండియా మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకోవడం అనేది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. భారత టీ20 లీగ్‌లో విశ్రాంతి లేకుండా టోర్నీ మొత్తం ఆడే వీళ్లకి.. టీమ్‌ఇండియాకు ఆడేటప్పుడు మాత్రం విశ్రాంతి కావాలా? వీరు ఆడేది భారత జట్టుకు. అలాంటప్పుడు విశ్రాంతి గురించి మాట్లాడకూడదు. టీ20 క్రికెట్‌లో 20 ఓవర్లే ఉంటాయి. ఆ మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన శారీరక శ్రమ పెరగదు. అది టెస్టు క్రికెట్‌లో మాత్రమే జరుగుతుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆటగాళ్లు మనసూ, శరీరంతో ఆడాల్సి ఉంటుంది. కాబట్టి టెస్టు మ్యాచ్‌లు ఆడినప్పుడు అలసటకు గురవుతారు. కానీ, పొట్టి ఫార్మాట్‌లో అలా ఉండదు. ఈ మ్యాచ్‌లు ఆడితే పెద్ద సమస్యలేం ఉండవు' అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.
ఇవీ చదవండి:
సూర్య.. సూర్యకుమార్.. పేరు గుర్తుపెట్టుకో.. ప్రత్యర్థి ఎవరైనా దబిడి దిబిడే
వన్డే సిరీస్‌పైనా కన్నేసిన రోహిత్ సేన.. ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌కు సిద్ధం