ETV Bharat / sports

T20 World Cup: ధావన్‌, శ్రేయస్‌కు దక్కని చోటు! - టీ20 ప్రపంచ కప్

టీ20 ప్రపంచకప్​కు(T20 World Cup) సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బీసీసీఐ జట్టును ప్రకటించనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్​ గావస్కర్(Sunil Gavaskar News) భారత​​ టీ20 ప్రపంచకప్​ జట్టు ఇలా ఉంటే బాగుంటుందంటూ వెల్లడించారు.

Sunil Gavaskar
సునీల్ గావస్కర్
author img

By

Published : Sep 8, 2021, 1:11 PM IST

టీ20 ప్రపంచకప్‌కు(T20 World Cup 2021) సమయం దగ్గరపడుతోంది. ఈ మెగాటోర్నీ ఒమన్‌, యూఏఈ వేదికగా అక్టోబరు 17న ప్రారంభం కానుంది. దీంతో చాలా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. బీసీసీఐ కూడా నేడు (సెప్టెంబర్ 8) జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే, అంతకంటే ముందే భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌(Sunil Gavaskar) టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో తన జట్టును ప్రకటించారు.

ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌ చేయాలని గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఈ క్రికెట్‌ దిగ్గజం ఎంపిక చేసిన జట్టులో శిఖర్‌ ధావన్‌(Shikhar Dhawan News), శ్రేయస్‌ అయ్యర్‌కు(Shreyas Iyer) చోటు దక్కలేదు. రోహిత్ శర్మ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఓపెనర్లుగా ఎంచుకోగా.. యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. రిషభ్ పంత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. పాండ్యా సోదరులకు చోటు దక్కింది.

"అతడు ఆల్‌రౌండర్‌. చాలా అనుభవం ఉన్న ఆటగాడు. ఐపీఎల్‌లో కొన్ని సంవత్సరాలుగా రాణిస్తున్నాడు. అతడు కచ్చితంగా ఒక స్థానానికి అర్హుడు. పైగా ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌" అని కృనాల్ పాండ్యా గురించి గావస్కర్ వివరించారు.

గావస్కర్‌ భారత టీ20 జట్టు:

రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్‌, రిషభ్ పంత్‌(వికెట్‌కీపర్), హార్దిక్‌ పాండ్యా, కేఎల్ రాహుల్‌,కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌(ఫిట్‌నెస్‌ సాధిస్తే), జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, యుజువేంద్ర చాహల్‌.

ఇదీ చదవండి:

ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్​లో ధావన్​కు ఛాన్స్​ దక్కేనా!

Shikhar Dhawan: విడిపోయిన​ ధావన్‌ దంపతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.