త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారిని (Gavaskar on Vihari) ఎంపిక చేయకపోవడం తానేమి ఆశ్చర్యానికి గురిచేయలేదని టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్నారు. అతడు గత కొన్ని నెలలుగా క్రికెట్ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో (Gavaskar on Vihari) విహారి ఆడకపోవడం వల్ల అతడు సెలెక్టర్ల దృష్టిలో పడలేదని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్‌లోని ప్రదర్శనలు జాతీయ జట్టులో ఎంపికలను ప్రభావితం చేస్తున్నాయని ఆయన చెప్పారు. నవంబర్ 25 నుంచి కివీస్‌తో జరిగే రెండు టెస్టులకు ఇటీవలే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. విహారిని ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లపై అనేక విమర్శలు వచ్చాయి.
'నిజాయితీగా చెప్పాలంటే హనుమ విహారిని (Gavaskar on Vihari) ఎంపిక చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. అతడు గత మూడు, నాలుగు నెలల్లో ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లు కొంతకాలంగా క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లు ఎంపిక కావడానికి ఇదే కారణం కావొచ్చు.' అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో ప్రదర్శనలు ఆధారంగా కొంతమంది ఆటగాళ్లు సెలక్షన్ కమిటీ దృష్టిలో పడుతున్నారని.. ఇలా జరుగుతుండటం చాలా సంవత్సరాలుగా చూస్తున్నామని పేర్కొన్నారు. హనుమ విహారి ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టే అతడు సెలెక్టర్ల దృష్టిలో పడలేదని విశ్లేషించారు.
ఇదీ చూడండి : కంగారూ గూటికి చిట్టి ప్రపంచకప్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?