ETV Bharat / sports

WTC FINAL: తొలి ఛాంపియన్​షిప్​ వరించేదెవరిని? - క్రికెట్ అప్​డేట్స్​

సౌథాంప్టన్ వేదికగా శుక్రవారం మొదలవనున్న డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​కు ఇరుజట్లు భారీ వ్యుహాలతో సిద్ధమయ్యాయి. నైపుణ్యాలు, సామర్థ్యాల పరంగా ఇరుజట్ల ఆటగాళ్లు సమవుజ్జీలుగా ఉండడం వల్ల మ్యాచ్ ఫలితంపై అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ పెరిగిపోతున్నాయి. మరి ఇరుజట్లు బలాబలాల ఎలా ఉన్నాయంటే..

WTC final match
డబ్ల్యూటీసీ ఫైనల్
author img

By

Published : Jun 18, 2021, 5:01 AM IST

సౌథాంప్టన్ వేదికగా.. భారత్‌, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ శుక్రవారం ప్రారంభంకానుంది. 144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ను శిఖరాగ్రంపై నిలబెట్టే ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లు భారీ వ్యుహాలనే రచించాయి. కనీసం మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా కోహ్లీసేన, ఇంగ్లాండ్‌ను 1-0తో ఓడించిన ఉత్సాహంతో విలియమ్సన్‌ బృందం సమరానికి సిద్ధమయ్యాయి. మ్యాచ్‌ విన్నర్లు, స్టార్లు ఇరువైపులా ఉండడంతో... బలాబలాలపరంగా ఇరుజట్లు సమవుజ్జీలుగానే కనిపిస్తున్నాయి.

టీం ఇండియా బలబలాలు..

ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోయినా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచేందుకు కోహ్లీసేన వద్ద అపారమైన వనరులున్నాయి. న్యూజిలాండ్ బౌలర్ నీల్‌ వాగ్నర్‌ సంధించే షార్ట్‌పిచ్‌ బంతులను ఎదుర్కొని నిలిచేందుకు చెతేశ్వర్‌ పుజారా పూర్తిగా సన్నద్ధమయ్యాడు. ఇక వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో పరుగులు పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ కొత్తబంతితో మాయచేసే ట్రెంట్‌బౌల్ట్‌, టిమ్‌ సౌథీ జోడీని సమర్థంగా ఎదుర్కొనేందుకు నెట్స్‌లో విరామం లేకుండా శ్రమించారు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ దూకుడు, టెక్నిక్‌కు ఇంగ్లాండ్‌ పర్యటన పరీక్ష పెట్టనుంది. దేశ విదేశాల్లో అపార అనుభవం ఉన్న సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ భారత్‌ జట్టుకు అదనపు బలమనే చెప్పాలి. వివిధ కోణాల్లో యార్కర్లు, వైవిధ్యమైన బంతులు వేసే జస్‌ప్రీత్‌ బుమ్రాను నిలువరించడం కివీస్‌ బ్యాట్స్‌మెన్‌కు అంత సులభమేమీ కాదు. మహమద్‌ షమి లేట్‌ స్వింగ్‌ను ఆడటం ఎవరికైనా సవాలే. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో రాణించగల జడేజా, స్పిన్‌ ఉచ్చులో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయగల అశ్విన్‌ మరోసారి తమ సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్నారు.

కివీస్​ తక్కువేం కాదు..

న్యూజిలాండ్‌ వద్ద దిగ్గజ ఆటగాళ్లకు కొదవలేదు. ఇప్పటివరకూ ఆడని ఆరు అడుగుల 9 అంగులాల కైల్‌ జేమీసన్‌ను విలయమ్సన్‌ తన షార్ట్‌పిచ్‌ బంతుల అస్త్రంగా ప్రయోగించే అవకాశం ఉంది. నీల్‌ వాగ్నర్‌ బ్యాట్స్‌మెన్‌ రిబ్స్‌ లక్ష్యంగా బంతులేసి ఇబ్బందిపెట్టడంలో సిద్ధహస్తుడు. దూకుడుతో బౌలర్లను భయపెట్టే పంత్‌కు వాగ్నర్‌కు మధ్య ఆసక్తికర పోరు సాగుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కివీస్ ఓపెనర్‌ డేవిడ్‌ కాన్వే తనదైన రోజున భారీ ఇన్నింగ్స్‌ ఆడగల సత్తా ఉన్నవాడు. కివీస్‌ సారథి కేన్స్‌ విలయమ్సన్‌.. కవర్‌ డ్రైవ్‌లతో మైదానంలో పరుగుల వరద పారించగలడు. రాస్‌ టేలర్‌ లాంటి సీనియర్‌ ఆటగాడు, సౌథీ, బౌల్ట్‌ లాంటి పేస్‌ బలగం కూడా న్యూజిలాండ్‌కు అదనపు బలమే.

నైపుణ్యాలు, సామర్థ్యాల పరంగా ఇరుజట్ల ఆటగాళ్లు సమవుజ్జీలుగా ఉండడం వల్ల మ్యాచ్ ఫలితంపై అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ పెరిగిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విజేతకు 1.6 మిలియన్ అమెరికన్‌ డాలర్లు అంటే దాదాపు 11 కోట్ల 85 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ దక్కనుంది.

వర్ష గండం..

ఐతే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వర్ష గండం పొంచి ఉంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు సాధారణం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ వెబ్‌సైట్లు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. మ్యాచ్‌ డ్రా లేదా టైగా ముగిసినా భారత్‌, న్యూజిలాండ్‌ను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

ఇదీ చదవండి:WTC Final: భారత్-కివీస్​ ఫేస్ టూ ఫేస్ రికార్డులు

WTC Final: భారత్ vs న్యూజిలాండ్.. విజేత ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.