ETV Bharat / sports

కోహ్లీ పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయి!.. 'వాల్తేరు విరాట్‌' హవా మాములుగా లేదుగా!! - భారత్​ శ్రీలంక వన్డే సిరీస్​

సంక్రాంతికి చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య విడుదల కానుంది. మరోవైపు అదే సమయంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌ క్రికెట్‌ అభిమానులను అలరించనుంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని, కోహ్లీని పోల్చుతూ పెట్టిన ఓ ఫొటో వైరల్‌గా మారింది.

Waltair virat
Waltair virat
author img

By

Published : Jan 9, 2023, 12:15 PM IST

తొలి టీ20 సిరీస్‌ విజయంతో ఈ ఏడాదిని గొప్పగా ప్రారంభించిన టీమ్‌ఇండియా.. శ్రీలంకతో వన్డే సిరీస్‌ కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 10న తొలి వన్డే జరగనుంది. సీనియర్లు లేకుండానే పొట్టి సిరీస్‌లో అదరగొట్టిన భారత్‌.. రోహిత్‌ శర్మ, కోహ్లీ లతో కూడిన జట్టుతో వన్డే సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ ఎంట్రీపై ప్రముఖ స్పోర్ట్స్‌ ఛానల్‌ 'స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు' తనదైన శైలిలో స్పందించింది.

ఈ సంక్రాంతికి విడుదల కానున్న మెగాస్టార్‌ చిరంజీవి సినిమా 'వాల్తేరు వీరయ్య' లోని డైలాగ్‌ను కోహ్లీకి అన్వయించింది. 'రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్‌ ఉంటాయి.. కింగ్‌ కోహ్లీ బ్యాక్‌ ఇన్‌ యాక్షన్' అంటూ ఆ సినిమాలోని చిరంజీవి పోస్టర్‌లో కోహ్లీని చేర్చి పోస్టు చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది.

virat kohli
వాల్తేరు విరాట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.