బుధవారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన లంకేయులకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. లంక జట్టు స్కోరు 12 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(11)ను భువీ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్ మినోద్ భానుక(36) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.ప్రమాదకరంగా మారుతున్న భానుకను కుల్‌దీప్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధనుంజయ డిసిల్వ(40) లంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. లంక విజయానికి చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా.. డిసిల్వ సునాయసంగా లంకను విజయతీరాలకు చేర్చాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గబ్బర్ సేనకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కెప్టెన్ శిఖర్ ధావన్(40) రాణించగా..మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(21) పడిక్కల్(29) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ రెండు, హసరంగ, శనక, చమీరా తలో వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి : 'హార్దిక్ పనైపోయింది.. వారిద్దరిపై దృష్టి పెట్టండి'