భారత్- శ్రీలంక పరిమిత ఓవర్ల సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లంక జట్టులో కరోనా కలకలం.. ఆటగాళ్లలో భయాన్ని రేకెత్తిస్తోంది. ఆ జట్టు డేటా ఎనలిస్ట్ జీటీ. నిరోషన్ కరోనా బారిన పడగా.. అంతకుముందు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే జట్టులో ఇద్దరు సభ్యులు కరోనా బారిన పడటం వల్ల ఆటగాళ్లు భయాందోళనలో ఉన్నారు.
సిరీస్ జరిగేనా?
ఈ క్రమంలో జులై 13 నుంచి మొదలవాల్సిన భారత్- శ్రీలంక వన్డే సిరీస్ సజావుగా సాగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ ఫ్లవర్ కొవిడ్ బారిన పడటం వల్ల ఆటగాళ్లు అభద్రతా భావానికి లోనవుతున్నారు.
ఫ్లవర్, నిరోషన్లు ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి.. చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఇదీ చదవండి :