ETV Bharat / sports

Cricket News: భారత్​తో సిరీస్​.. కొత్త జట్టుతో లంక! - central contract srilanka crikcet board

జాతీయ కాంట్రాక్టుపై సంతకాలు చేయని ఆటగాళ్లను భారత్​తో జరగబోయే సిరీస్​కు పక్కనపెట్టాలని శ్రీలంక క్రికెట్​ బోర్డు(Sri Lanka cricket board) భావిస్తోంది. కేవలం కాంట్రాక్ట్​కు అంగీకారం తెలిపిన ప్లేయర్స్​నే తీసుకుని కొత్త జట్టును ఆడించాలని చూస్తోంది.

srilanka cricket board
శ్రీలంక క్రికెట్​ బోర్డు
author img

By

Published : Jul 4, 2021, 6:08 PM IST

జాతీయ కాంట్రాక్ట్​ విషయమై శ్రీలంక క్రికెట్​ బోర్డు(ఎస్​ఎల్​సీ), ఆ దేశ ఆటగాళ్ల మధ్య వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో త్వరలో టీమ్​ఇండియాతో జరగబోయే సిరీస్​లో సంతకాలు చేయని ప్లేయర్స్​ను పక్కనపెట్టాలని లంక బోర్డు భావిస్తోంది! ప్రత్యామ్నయంగా వారి స్థానంలో ఒప్పందానికి(కాంట్రాక్ట్​) అంగీకారం తెలిపిన ఆటగాళ్లను మాత్రమే ఆడించాలని ప్లాన్ చేస్తోంది.

"39మంది ఆటగాళ్లు ఒప్పందానికి అంగీకారం తెలిపారు. మేం తొలి ప్రాధాన్యత ఇచ్చిన ఆటగాళ్లు ఎవరైతే సంతకాలు చేయరో వారిని సిరీస్​కు ఎంపిక చేయం. సంతకాలు చేసిన వారితోనే రెండో(కొత్త) జట్టును తయారుచేసి ఆడిస్తాం. ఇప్పటికే వారు ప్రాక్టీస్​ చేస్తున్నారు. ఇంగ్లాండ్​తో మూడో(చివరి) వన్డే పూర్తవ్వగానే భారత్​తో సిరీస్​లకు జట్టును ప్రకటిస్తాం" అని శ్రీలంక క్రికెట్ సెలక్టర్స్​ ఛైర్మన్​ ప్రమోద్య విక్రమ​సింఘె చెప్పినట్లు అక్కడి వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి.

ప్రస్తుతం టీమ్​ఇండియా.. శ్రీలంక పర్యటనలో ఉంది. కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలో 20 మందితో కూడిన మన జట్టు.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్​గా వ్యవహరించనున్నారు. జులై 13 నుంచి జులై 25 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్​తో సిరీస్​ ఆడతోంది లంక జట్టు. ఈ పర్యటనకు కాంట్రాక్ట్​పై సంతకాలు చేయకుండానే వెళ్లారు లంక ఆటగాళ్లు.

ఇదీ చూడిండి: శ్రీలంక బోర్డు వివాదం: కాంట్రాక్టులపై సంతకాలకు క్రికెటర్లు నో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.