బోర్డు ప్రతిపాదించిన సెంట్రల్ కాంట్రాక్టులను తిరస్కరించిన సీనియర్ క్రికెటర్లపై విమర్శలు కురిపించాడు శ్రీలంక మాజీ కెప్టెన్ అరవింద డిసిల్వా. ఫిర్యాదులను పక్కన పెట్టి మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని సూచించాడు. తన నేతృత్వంలో తయారు చేసిన వార్షిక కాంట్రాక్టులను ఆమోదించాలని తెలిపాడు.
"నా నేతృత్వంలో తయారు చేసిన వార్షిక కాంట్రాక్టు ప్రతిపాదనను ఆటగాళ్లు తిరస్కరించడం అన్యాయం. వాళ్లు బోర్డుపై ఫిర్యాదులు చేయడం ఆపి దేశం కోసం మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన చేయాలి."
-అరవింద డిసిల్వా, శ్రీలంక మాజీ కెప్టెన్
ఆటగాళ్ల గత ప్రదర్శనల ఆధారంగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ కాంట్రాక్టులను రూపొందించిందని, గతంతో పోల్చితే ఇందులో అదనపు ప్రయోజనాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని డిసిల్వా తెలిపాడు.
ఇదీ చదవండి: బోర్డుతో ముదురుతున్న ఆటగాళ్ల కాంట్రాక్ట్ వివాదం!