ETV Bharat / sports

'ఫిఫ్టీ'ల్లో కేఎల్​ రికార్డ్​- ఎలైట్​ లిస్ట్​లో కోహ్లీ, రోహిత్​ సరసన.. - ఐపీఎల్​ 2022 లేటెస్ట్​ న్యూస్​

KL Rahul Elite List: ఐపీఎల్​లో సోమవారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై గెలిచింది లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​. అర్ధసెంచరీతో రాణించాడు లఖ్​నవూ సారథి కేఎల్​ రాహుల్​. ఈ సందర్భంగా.. ఎలైట్​ లిస్ట్​లో చేరాడు.

SRH vs LSG: KL Rahul elite list scores his 50th T20 half-century

author img

By

Published : Apr 5, 2022, 9:46 AM IST

KL Rahul Elite List: లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కెప్టెన్​.. కేఎల్​ రాహుల్ ఐపీఎల్​లో సోమవారం సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో అర్ధసెంచరీతో రాణించాడు. ఈ సందర్భంగానే అరుదైన ఘనత సాధించాడు. రాహుల్​కు టీ20ల్లో ఇది 50వ అర్ధసెంచరీ. ఈ ఎలైట్​ లిస్ట్​లో భారత్​ నుంచి మరో నలుగురు మాత్రమే ఉన్నారు. విరాట్​ కోహ్లీ 76 అర్ధశతకాలతో తొలి స్థానంలో ఉన్నాడు. రోహిత్​ శర్మ(69), శిఖర్​ ధావన్​(63), రైనా(53) వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. రాహుల్​ ఐదోవాడు.

ఐపీఎల్​లో రాహుల్​కు ఇది 28వ హాఫ్​ సెంచరీ. ఐపీఎల్​లో అత్యధిక అర్ధసెంచరీలు చేసిన జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. అత్యధికంగా డేవిడ్​ వార్నర్​ 49 అర్ధసెంచరీలతో ఐపీఎల్​లో తొలి స్థానంలో ఉన్నాడు. కెప్టెన్​గా ఇది 13వది. ఈ జాబితాలో సెహ్వాగ్​, గిల్​క్రిస్ట్​ను దాటి ఆరో స్థానానికి చేరాడు. విరాట్​(40), గంభీర్​(31), వార్నర్​(27), రోహిత్​ శర్మ(23), ధోనీ (22) టాప్​-5లో ఉన్నారు.​ లీగ్​లో 3000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక సగటు రాహుల్​దే. ఇప్పటివరకు 94 మ్యాచ్​లాడిన కేఎల్​.. 46.66 సగటుతో 3,313 పరుగులతో ఉన్నాడు. గత నాలుగు సీజన్లలో ప్రతిసారీ 550 కంటే ఎక్కువ పరుగులు చేయడం విశేషం. ఎక్కువకాలం పంజాబ్​కు కెప్టెన్​గా ఉన్న రాహుల్​.. ఆ జట్టుకు టైటిల్​ తెచ్చిపెట్టలేకపోయాడు. ఈసారి లఖ్​నవూకు సారథ్యం వహిస్తున్నాడు. ఆడిన 3 మ్యాచ్​ల్లో లఖ్​నవూ రెండింట గెలిచి.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. 2020 నుంచి అద్భుత ఫామ్​లో ఉన్నాడు కేఎల్​. ఓపెనర్​గానే కాకుండా.. ఏ స్థానంలోనైనా రాణించగల సత్తా అతడి సొంతం.

సన్​రైజర్స్​పై 50 బంతుల్లోనే 6 ఫోర్లు, ఓ సిక్సర్​తో 50 బంతుల్లో 68 పరుగులు చేశాడు కేఎల్​. దీపక్​ హుడా(51) కూడా రాణించగా లఖ్​నవూ 169 పరుగులు చేసింది. అనంతరం.. బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్​ 157 పరుగులకే పరిమితమైంది. త్రిపాఠి(44), పూరన్​(34) మాత్రమే ఫర్వాలేదనిపించారు. లఖ్​నవూ బౌలర్లలో అవేశ్​ ఖాన్​ 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

ఇవీ చూడండి: 'ఐపీఎల్​పై నేను అలా అన్లేదు.. కావాలనే వక్రీకరించారు'

బస్సెక్కి బాల్యంలోకి క్రికెట్​ దిగ్గజం.. నెట్టింట వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.