Special Security To Babar Azam : 2023 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది పాకిస్థాన్ క్రికెట్ టీమ్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం ఈ మ్యాచ్ జరగనుంది. అయితే చాలాకాలం తర్వాత ఈ స్టేడియంలో ఆడనుంది పాకిస్థాన్. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు బంగాల్ పోలీసులు. ఇందుకోసం స్పెషల్ సెక్యురిటీ టీమ్‌ను నియమించారు. పాక్ క్రికెట్ జట్టు శనివారం కోలకతాకు చేరుకుంటుంది.
"పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో పాటు కెప్టెన్ బాబర్ ఆజమ్ శనివారం కోల్‌కతాకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వెంటనే ఆయన స్పెషల్ సెక్యురిటీ టీమ్ పర్యవేక్షణలో బస చేయనున్న సిటీ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గది బయట కూడా మా సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారు."
-కోల్‌కతా పోలీసు ఉన్నతాధికారులు
మైదానంలో కూడా..
బాబర్ బస చేసే హోటల్ లోపల, బయటనే కాకుండా ఆయన ఆడే ఈడెన్ మైదానంలోనూ పోలీసులు రక్షణగా ఉండనున్నారు. ఇందుకోసం అంతర్గత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆజమ్ ఫీల్డింగ్ చేసే సమయంలో కూడా బౌండరీల వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఎందుకంటే స్టేడియంకు వచ్చే అభిమానులు, ప్రేక్షకుల నుంచి బాబర్ ఎటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోకుండా ఉండేందుకే కోల్‌కతా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఓ పోలీసు ఉన్నతాధికారి ఈటీవీ భారత్‌తో చెప్పారు.
'గతంలో ఏదైనా ఆటగాడి కోసం ఈ రకమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారో, లేదో నాకు తెలియదు. కానీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కోసం మాత్రం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాము. భద్రతా కారణాల దృష్ట్యా దీనికి సంబంధించి ఇంతే సమాచారం చెప్పగలను' అని కోల్‌కతా పోలీసు అదనపు కమిషనర్ ఈటీవీ భారత్‌తో అన్నారు.
ఎందుకంత భద్రత..?
సాధారణంగా బాబర్ పాక్ ఆటగాడైనప్పటికీ అతడికి విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా బాబర్ పెద్దగా ఎవరితోనూ కలవని వ్యక్తి. సరదాలు, ఆనందానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడతాడు. అందుకని అభిమానులెవ్వరూ ఆయన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమాండో ఫోర్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్(SAF)ను కోల్‌కతా పోలీసులు బాబర్ ఆజమ్ కోసం ఏర్పాటు చేశారు. పాక్ క్రికెట్ జట్టు నగరంలో ఉన్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ రెండంచెల భద్రతా సిబ్బంది పనిచేస్తుంది.
ODI World Cup 2023 Rohith Sharma : కెప్టెన్‌గా 100వ మ్యాచ్.. అరుదైన రికార్డ్‌పై హిట్ మ్యాన్ గురి