ETV Bharat / sports

'విరాట్ కోహ్లీ లాంటోళ్లు ఎందరో.. అలా చేస్తేనే మానసిక ఒత్తిడిని జయించొచ్చు' - మెంటల్​ స్ట్రెస్​పై విరాట్​ కోహ్లీ

విరాట్​ నిస్సందేహంగా భారతీయ క్రికెట్ టీమ్​ చూసిన అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. భారీ సంఖ్యలో అభిమానులున్న అతడు ఇప్పటికే మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడంతో పాటు అలాంటి ఆలోచనల్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతున్నాడు. బ్యాటర్​గా కష్టాల్లో ఉన్న తన టీమ్​ను ఎన్నోసార్లు ఆదుకున్నాడు. తన టీమ్​కు సపోర్టివ్​గా ఉండి​ ఎన్నోసార్లు విజయాన్ని అందించాడు. అయితే టీమ్​పై అభిమానులు పెట్టుకున్న అంచనాలు.. ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని మనం గుర్తించాలని అంటున్నారు మానసిక నిపుణులు. ఈ మేరకు అథ్లెట్లు ఎదుర్కొనే ఒత్తిడితో పాటు సుదీర్ఘ విరామంలో విరాట్ కోహ్లీ ఎలా ఈ మానసిక ఒత్తిడిని జయించాడన్న విషయాల గురించి ప్రముఖ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ సైకాలజిస్ట్ డాక్టర్ నానాకి జె. చద్దా ఈటీవీ భారత్​కు ఇచ్చిన స్పెషల్​ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

indian Sport and Performance Psychologist
Special Interview On Mental Stress of Athelets
author img

By

Published : Oct 12, 2022, 7:33 PM IST

ఫేస్​ ఆఫ్​ ది 'న్యూ ఇండియా'గా పేరొందిన భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ..అట్టడుగులో ఉన్న తన టీమ్​ను ఎన్నోసార్లు ఆదుకున్నాడు. తన టీమ్​కు సపోర్టివ్​గా ఉండి​ ఎన్నోసార్లు విజయాన్ని అందించాడు. అయితే టీమ్​పై అభిమానులు పెట్టుకున్న అంచనాలు ఆటగాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని మనం గుర్తించాలని అంటున్నారు మానసిక నిపుణులు. ఈ మేరకు అథ్లెట్లు ఎదుర్కొనే ఒత్తిడితో పాటు సుదీర్ఘ విరామంలో విరాట్ కోహ్లీ ఎలా ఈ మానసిక ఒత్తిడిని జయించాడన్న విషయాల గురించి ప్రముఖ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ సైకాలజిస్ట్ డాక్టర్ నానాకి జె. చద్దా ఈటీవీ భారత్ స్పెషల్​ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నెల రోజుల విరామం తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా భిన్నమైన బ్యాటర్‌గా కనిపిస్తున్నాడు. ఒక నెల మొత్తం క్రికెట్​కు దూరంగా ఉండటం వల్ల ఆటపై మరింత ప్రేమ కలిగిందని ఓ సందర్భంలో అన్నాడు. కొంత కాలం క్రీడలకు దూరంగా ఉండడం ఎందుకు అవసరమని మీరు అనుకుంటున్నారు?
ప్రముఖ అథ్లెట్లు అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటుంటారు. నిరంతర ప్రయాణం, అభిమానుల భారీ అంచనాలు, పెర్​ఫెక్ట్​గా ఉండాలన్న వైఖరి.. ఇవన్నీ ఒత్తిడికి కారణమయ్యే వాటికి ఉదాహరణలు మాత్రమే. విరాట్ కోహ్లీ లాంటి అథ్లెట్లు నిరంతరం ప్రజల పరిశీలనలోనే ఉంటారు. వారి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ప్రతి నిర్ణయంపై ప్రజలు ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తారు.

సాధారణ శిక్షణా షెడ్యూల్‌లతో పాటు ఈ నిరంతర అనవసర పరిశీలనల వల్ల ప్లేయర్లు అధిక ఒత్తిడికి లోనవుతారు. పోటీతత్వం ఉండే క్రీడల్లో కచ్చితంగా శారీరక ఒత్తిడి ఉంటుంది. అయితే క్రీడల్లో మానసికంగా, ఎమోషనల్​గా కూడా ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిళ్లు.. అథ్లెట్లకు క్రీడపై ఉన్న ఇష్టాన్ని కోల్పోయేలా చేస్తుంది. అంతే కాకుండా ఆట నుంచి విరామం తీసుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. అందువల్ల, అథ్లెట్లు టైమ్ ప్రకారం విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల వారు విశ్రాంతి తీసుకుంటారు. కోల్పోయిన శక్తిని పుంజుకొని పునరుత్తేజితులు అవుతారు. దీంతో వారు కొత్త మైండ్​సెట్​తో ఆటలోకి తిరిగి వస్తారు.

ఇంతకుముందులా లేనని.. కొన్ని సందర్భాలలో తనలాగా తాను ప్రవర్తించలేదని.. అంతే కాకుండా కొన్ని సమయాల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ ఆనందంగా ఉన్నట్లు నటించానని విరాట్​ తెలిపాడు. మానసికంగా స్ట్రాంగ్​గా ఉన్న ఆటగాడని విరాట్​ను పలువురు ప్రశంసించిన సందర్భాలున్నాయి. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ వారు ఎలా అంత స్ట్రాంగ్​గా ఉండగలరు? ఓ క్రీడా సైకాలజిస్ట్‌గా, పురుష లేదా మహిళా క్రీడాకారులు మానసిక ఆరోగ్యంతో మెరుగ్గా ఉండేందుకు ఏం చేయాలి?

గత కొన్ని సంవత్సరాలుగా, భారత్​తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రసిద్ధ అథ్లెట్లు తమ మానసిక ఆరోగ్య విషయమై విరామం తీసుకోవడం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. 2019లో ఆస్ట్రేలియన్​​ స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ మానసిక ఆరోగ్య సమస్యల వల్ల క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా, ఏడుసార్లు ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న సిమోన్ బైల్స్ 2020లో టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలిగినప్పటి నుంచి జిమ్నాస్టిక్స్​కు కొన్నాళ్లు దూరంగా ఉన్నారు.
ఈ ఒత్తిడిని జయించాలంటే వారికి మొదట స్పోర్ట్స్ సైకాలజీ సపోర్ట్ ఎంతో అవసరం. దీని ద్వారా వారు పోటీ ఒత్తిడిని తట్టుకోగలరు. ఇటీవల భారత పురుషుల క్రికెట్ సపోర్టింగ్ స్టాఫ్​ టీమ్​కు క్రీడా సైకాలజిస్ట్ ప్యాడీ అప్టన్‌ని తిరిగి నియమించడం శుభపరిణామం.

ఇంకా కష్టపడితే మరింత మెరుగ్గా ఆడగలమన్నది క్రీడాకారుల భావన. దాని కోసం వారు మరింత ప్రాక్టీస్​ చేయడంలో నిమగ్నమైపోతారు. ఎంత కష్టపడి శిక్షణ తీసుకుంటే, వారి పనితీరు అంత మెరుగ్గా ఉంటుందని భావిస్తారు. ఇది అవాస్తవం. క్రీడాకారులు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు బయటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చాలా అవసరం. ఇవన్ని ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయి. చివరగా, అథ్లెట్లు అభివృద్ధి చెందడానికి కోచ్‌లు వారికోసం మంచి వాతావరణాన్ని సృష్టించాలి. సైకాలజిస్ట్​ల సలహా సూచనలను తీసుకుంటే ఇది మరింత సులువు అవుతుంది.

ఇటీవల ఆసియా కప్‌లో సెంచరీ సాధించినప్పుడు విరాట్ తన భార్య అనుష్క శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక ఆటగాడు ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించడానికి అథ్లెట్లకు వారి భాగస్వాములు ఏమేర సహాయం చేయగలరు?
అన్ని వృత్తులలో మద్దతు ఉండటం కీలకం. ఇది తమ తల్లిదండ్రులు, కోచ్‌లు లేదా సహచరులు/సహోద్యోగుల నుంచి రావచ్చు. అథ్లెట్‌కు సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ కూడా ఇటీవల లావర్ కప్‌ సమయంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన భార్య మిర్కాతో పాటు తన పిల్లలు అతనికి ఎంత సపోర్టివ్​గా ఉన్నారన్న విషయం గురించి ప్రస్తావించాడు. కానీ ఈ విషయాన్ని చాలా వరకు అందరూ మరచిపోతారు. ఇలాంటి విషయాలను గుర్తించడం కూడా చాలా అవసరం.

ఇప్పటి ఆటగాళ్లు ప్రకటనలు, బ్రాండ్​ ప్రమోషన్లు, దేశానికి ప్రాతినిథ్యం వహించడం వంటి అంశాల విషయంలో నిబద్ధత కలిగి ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో సూపర్ స్టార్‌లుగా పరిగణించే క్రికెటర్లు వీటి గురించి మరింతగా ఆలోచిస్తారు. ఇవన్ని ఆటగాడి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే.. వాటిని తగ్గించడం లేదా సర్దుబాటు చేయాలని మీరు భావిస్తున్నారా?

అవును, కచ్చితంగా. ఈ రోజుల్లో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు, లేదా పోటీల కోసం ప్రయాణం చేస్తున్నారు లేకపోతే యాడ్​లతో బిజీగా ఉన్నారు. అందువల్ల వారి షెడ్యూల్‌లు ఓవర్‌లోడ్ అయిపోతున్నాయి. కనీస విశ్రాంతి తీసుకునేందుకు వారికి సమయం లేకుండా పోయింది. విశ్రాంతి తీసుకోవడానికి ఖాళీ సమయాన్ని కేటాయించకపోవడం వల్ల మైదానంలో వారి పనితీరు దెబ్బతింటుంది. ఈ అధిక భారం నుంచి కోలుకోలేని అథ్లెట్లు దాని ద్వారా వచ్చే పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శారీరక అలసటతో పాటు మానసిక అలసట.. పనితీరులో మార్పులు, ఆట సమయంలో ఫోకస్ లేకపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, అథ్లెట్లు సమయానుగుణంగా తమ పనులకు ప్రాధాన్యం ఇస్తే ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు.

విరాట్ కోహ్లీ లాంటి ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు బయటకు వచ్చి తమమానసిక ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడారు. ఇప్పుడున్న పురుష ప్లేయర్లకు ఇది ఎంతవరకు సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు. ముఖ్యంగా ఎమోషన్స్​ను బయట పెట్టకుండా, బలమైన మానసిక స్థితితో ఉన్న పురుష ఆటగాళ్లకు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది?

అభినవ్ బింద్రా తర్వాత తమ మానసిక ఆరోగ్యం గురించి ప్రస్తావించిన అతి కొద్ది మంది ప్లేయర్లలో విరాట్​ కోహ్లీ ఒకరు. పురుషులు ఎప్పుడూ స్ట్రాంగ్​గా ఉండాలి.. వారు ఏడవకూడదు అనే మూస ధోరణి అణచివేసేలా ఉంటుంది విరాట్​ కష్టాల జర్నీ. మన భావోద్వేగాలను అదుపు చేయాల్సిన అవసరం లేదని, కానీ తమ భావాల్ని తాము స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అనుమతించాలనే దృక్పథాన్ని ఆలోచిస్తే మనం ఈ విషయంలో చాలా దూరం వెళ్లొచ్చు. విరాట్​ నిస్సందేహంగా భారతీయ క్రికెట్ టీమ్​ చూసిన అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. భారీ అభిమానులున్న అతడు ఇప్పటికే మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడంతో పాటు అలాంటి ఆలోచనల్ని బద్దలు కొట్టడం ప్రారంభించాడు. అతడి అడుగుజాడలను అనుసరించిన చాలా మంది భారతీయ అథ్లెట్లు బయటకు వచ్చి తమ అనుభవాలు పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.