సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి జరగనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC final)లో టీమ్ఇండియా, న్యూజిలాండ్(IND vs NZ) జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం పేస్, బౌన్సింగ్ పిచ్‌ను తయారు చేయనున్నట్లు పిచ్ క్యూరేటర్ సైమన్ లీ వెల్లడించాడు.
"టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం పిచ్‌ను కొంచెం సులభంగానే తయారు చేయోచ్చు. కానీ, ఇది తటస్థ వేదిక కారణంగా ఐసీసీ మార్గనిర్దేశంలో పనిచేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పిచ్‌పై ఇరుజట్ల మధ్య మంచి సమానమైన పోటీ కావాలని కోరుకుంటున్నా. వ్యక్తిగతంగా చెప్పాలంటే పేస్, బౌన్సింగ్ పిచ్ తయారు చేయాలనుకుంటున్నా".
- సైమన్ లీ, సౌథాంప్టన్ పిచ్ క్యూరేటర్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉత్కంఠ పోటీ కోసం ఎదురుచూస్తున్నట్లు సైమన్ లీ తెలిపాడు. "ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితిలకు అనుగుణంగా పిచ్ తయారు చేయడం కష్టతరమైన పని. అంతేకాకుండా ఇరుజట్లలో అద్భుతమైన ప్రతిభ కలిగిన పేసర్లు ఉన్నారు. ఓ క్రికెట్ అభిమానిగా అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ సహకరించే పిచ్ కావాలని కోరుకుంటాను" అని సైమన్ లీ వెల్లడించాడు.
ఇదీ చూడండి.. Pujara: సమయం లేకున్నా.. సత్తా ఉంది!