ETV Bharat / sports

ఫ్యాన్స్​కు షాకిచ్చిన దాదా.. ఏం చేశాడంటే - గంగూలీ ఆజాదీ అమృత్ మహోత్సవ్​

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. ఏం చేశాడంటే.

ganguly legends league
గంగూలీ లెజెండ్స్​ లీగ్​
author img

By

Published : Sep 3, 2022, 3:18 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. దాదా మళ్లీ బ్యాట్‌ పట్టుకుని మైదానంలో దిగుతాడంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​ ఆశలపై నీళ్లు చల్లాడు. కాగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా)లో భాగంగా లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌-2022 తాజా సీజన్‌ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభం కానుంది.

కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య సెప్టెంబరు 16న చారిటీ మ్యాచ్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్‌కు గంగూలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ప్రకటన విడుదల చేశారు నిర్వాహకులు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మ్యాచ్‌ నుంచి గంగూలీ తప్పుకొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

వ్యక్తిగత కారణాల వల్ల గంగూలీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఇంగ్లీష్​ వెబ్​సైట్​ వెల్లడించింది. ఈ మేరకు.. "అవును... నేను చారిటీ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. కానీ సమయాభావం వల్ల ఆడలేకపోతున్నాను" అని గంగూలీ పేర్కొనట్లు తెలిపింది. కాగా ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌ జెయింట్స్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మెర్గాన్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.

ఇదీ చూడండి: సన్​రైజర్స్​ సంచలన నిర్ణయం.. టామ్​ మూడికి గుడ్​బై.. కొత్త కోచ్​ ఎవరంటే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.