ETV Bharat / sports

WTC Final: 'ఈసారి టీమ్​ఇండియాదే టైటిల్'

వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​లో టీమ్​ఇండియా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారని గంగూలీ అన్నాడు. త్వరలో ప్రారంభమయ్యే రెండో ఎడిషన్​లో మన జట్టు విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు.

sourav ganguly, bcci president
సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
author img

By

Published : Jun 27, 2021, 3:49 PM IST

Updated : Jun 27, 2021, 4:11 PM IST

ఐసీసీ(ICC) ప్రారంభ ఎడిషన్​ ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్ (World Test Championship)​పై స్పందించాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly). ఈ రెండేళ్ల కాలంలో టీమ్ఇండియా అద్భుతంగా ఆడిందని.. జట్టు తరఫున పలువురు ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేశారని దాదా మెచ్చుకున్నాడు.

డబ్ల్యూటీసీ తొలి విడతలో కోహ్లీసేన వెస్టిండీస్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విజయవంతంగా సిరీస్​లను గెలుచుకుంది. స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్ 71 వికెట్లతో టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు. అత్యధిక పరుగులు చేసిన వారిలో భారత్ వైస్​ కెప్టెన్ అజింక్య రహానె మన జట్టు తరఫున అగ్రస్థానం సాధించాడు. వీరిద్దరూ తమ అంచనాలను అందుకున్నారని గంగూలీ ప్రశంసించాడు.

"ఈ రెండేళ్ల డబ్ల్యూటీసీ ప్రయాణంలో ప్రతి ఒక్కరు భాగమయ్యారు. తొలి ఎడిషన్​లో రహానె ఎక్కువ పరుగులు చేశాడు. బౌలింగ్​లో ఇషాంత్​, షమి మంచి ప్రదర్శన చేశారు. కపిల్​ దేవ్​ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్​లో 100 టెస్టులు ఆడిన ఫాస్ట్​ బౌలర్​గా ఇషాంత్ రికార్డు సృష్టించాడు. రోహిత్​తో పాటు రహానె, విరాట్​ అద్భుతంగా ఆడారు."

-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో ఓడిన కోహ్లీసేనకు రెండో ఎడిషన్​లో గెలిచే అవకాశముందని దాదా అభిప్రాయపడ్డాడు. తొలి సీజన్​లో అద్భుతంగా రాణించిన టీమ్ఇండియా.. ఈసారి టైటిల్ సాధిస్తుందని అంచనా వేశాడు.

ఇదీ చదవండి: Yuvraj singh: మరో విదేశీ లీగ్​లో యువరాజ్ సింగ్

Last Updated : Jun 27, 2021, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.