ETV Bharat / sports

తెరపై గంగూలీ బయోపిక్.. దాదా ట్వీట్

తన బయోపిక్​ను లవ్​ ఫిలింస్​ నిర్మాణ సంస్థ రూపొందించబోతున్నట్లు తెలిపాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly biopic). దీనికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ganguly
గంగూలీ
author img

By

Published : Sep 9, 2021, 1:04 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly biopic) బయోపిక్​కు రంగం సిద్ధమైంది. లవ్​ ఫిలింస్​.. దాదా జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించనుంది. ఈ విషయాన్ని దాదా ట్వీట్​ చేశాడు. అయితే సినిమాలో హీరోగా ఎవరు నటించనున్నారో తెలపలేదు.

  • Cricket has been my life, it gave confidence and ability to walk forward with my head held high, a journey to be cherished.
    Thrilled that Luv Films will produce a biopic on my journey and bring it to life for the big screen 🏏🎥@LuvFilms @luv_ranjan @gargankur @DasSanjay1812

    — Sourav Ganguly (@SGanguly99) September 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"క్రికెట్​ నా జీవితం. జీవితంలో తల ఎత్తుకొని ముందుకెళ్లడాని ఈ ఆట నాకు సామర్థ్యం, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ ప్రయాణం ఎంతో గొప్పది. లవ్​ ఫిలింస్ వారు నా బయోపిక్​ నిర్మించేందుకు సిద్ధమవ్వడం సంతోషంగా ఉంది. వారు నా కెరీర్​ను వెండితెరపైకి తీసుకురానున్నారు."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఇప్పటికే ధోనీ, మహ్మద్​ అజారుద్దీన్​, సచిన్​ తెందుల్కర్​ జీవిత చరిత్రలు వెండితెరపై ప్రేక్షకులను కనువిందు చేశాయి. త్వరలోనే 1983 ప్రపంచకప్‌ నేపథ్యంలో రూపొందిన కపిల్‌దేవ్‌ జీవితకథ '83' సినిమా విడుదల కానుంది.

ఇదీ చూడండి: బయోపిక్​కు గంగూలీ ఓకే.. ప్రధాన పాత్రలో ఆ హీరో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.