ETV Bharat / sports

సినిమాను తలపించేలా 'దాదా' డేరింగ్ ప్రేమ కథ - సౌరవ్​ గంగూలీ లవ్​ స్టోరీ

ప్రేమ కథలు చదవడం, వినడంపై ఆసక్తి ఉందా? ఎన్నో రొమాంటిక్​ లవ్​స్టోరీలను మీరు చూసుండొచ్చు. సెలబ్రిటీల విషయానికొస్తే.. వారిపై మనం ఎనలేని అభిమానం చూపిస్తాం. మరి ఆ సెలబ్రిటీల జీవితమే ఓ సినిమాను తలపిస్తే... మీకు తెలుసుకోవాలని ఉండదా? క్రికెటర్​ సౌరవ్​​​ గంగూలీ ఈ కోవకే చెందుతాడు. క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ డాషింగ్​ లెఫ్ట్​హ్యాండర్​ ప్రేమ కథ(Sourav ganguly love).. బాలీవుడ్​ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. అతడి 49వ పుట్టినరోజు సందర్భంగా ఆ లవ్​స్టోరీ మీకోసం..

Ganguly love story
సౌరభ్ గంగూలీ లవ్​ స్టోరీ
author img

By

Published : Jul 8, 2021, 9:50 AM IST

సౌరవ్​​ గంగూలీ(Sourav Ganguly)... క్రికెట్​ ప్రియులకు సుపరిచితమైన పేరు. ముద్దుగా అభిమానులు దాదా అని పిలుచుకుంటారు. కోల్​కతా ప్రిన్స్​, బెంగాల్​ టైగర్​ ఇలా చాలా పేర్లే ఇతడికి ఉన్నాయ్​ లెండి. భారత క్రికెట్​లో విజయవంతమైన కెప్టెన్​గా, దూకుడైన బ్యాట్స్​మన్​గా అభిమానుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు గంగూలీ. అయితే.. దాదా అంటే క్రికెట్​ మాత్రమే కాదు, అంతకుమించి ఆసక్తి రేకెత్తించే ప్రేమకథ(Sourav Ganguly love) అతడి జీవితంలో ఉంది. 1997 ఫిబ్రవరి 1న ఆ ప్రేమ.. పెళ్లి పీటలెక్కింది.

చిన్నప్పటినుంచే గంగూలీ, డోనాలు ఒకరికొకరు తెలుసు. వారిద్దరివీ పక్క పక్క ఇళ్లే అయినా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఫుట్​బాల్​ ప్రాక్టీస్​కు వెళ్లేటప్పుడు ఆమెపై చూపుల బాణాలు విసిరేవాడు దాదా. ఆమెను ఆకర్షించేందుకు అప్పుడప్పుడు డోనా చదివే పాఠశాల మీదుగా వెళ్లేవాడు. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్​ బసు నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, స్వయంగా గంగూలీనే ఈ విషయాన్ని అంగీకరించాడు.

'' నేను ఫుట్​బాల్​ ఆడుతున్నప్పుడు.. ఎక్కడికో వెళ్లేవాడిని. నేను ఆమెను బాగా చూసేవాడ్ని''

- సౌరవ్​ గంగూలీ

డోనా తక్కువేం కాదు. తనకు తెలియకుండానే దాదా ప్రేమలో పడిపోయింది. దాదా బ్యాడ్మింటన్​ ఆడే సమయంలో షటిల్​ కాక్​ ఎప్పుడెప్పుడు.. తన కాంపౌండ్​లో పడుతుందా అని ఎదురుచూసేదట. ఓ ముఖాముఖిలో ఈ విషయాన్ని వెల్లడించింది గంగూలీ ప్రేయసి.

''షటిల్​కాక్​.. మా కాంపౌండ్​లో పడినప్పుడల్లా.. దానిని తిరిగిచ్చేందుకు నాకు ఛాన్స్​ దొరికేది.''

- డోనా గంగూలీ

రెస్టారెంట్​లో డేట్​కు..

కోల్​కతాలోని చైనీస్​ రెస్టారెంట్​లో తొలిసారి డేట్​కు వెళ్లిందీ జంట. అయితే.. దాదా చేసిన ఫుడ్​ ఆర్డర్​ను చూసి డోనా ఆశ్చర్యపోయింది. కానీ.. చివరకు మొత్తం లాగించేశాడట.

ఇక్కడో విలన్​..!

ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు కానీ ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోయారు. తొలుత సౌరవ్​ తల్లిదండ్రులు.. వారి ప్రేమను తిరస్కరించినా, చివరకు ఒప్పుకున్నారు. అయితే.. ఇక్కడే ఊహించని ట్విస్ట్​ ఎదురైంది. డోనా తండ్రికి.. గంగూలీ కుటుంబంతో ఏళ్లుగా గొడవలున్నాయి. ఆయన.. పెళ్లికి ఒప్పుకుంటాడో లేదోనని కొంత అనుమానాలున్నా.. గంగూలీ ఏ మాత్రం ఆశలు కోల్పోలేదు. రోజూ డోనాను కలిసేవాడు. డోనా కూడా గంగూలీ కోసం క్రికెట్​ మ్యాచ్​లకు హాజరయ్యేది.

రహస్య పెళ్లి...

డోనా తండ్రి ఒప్పుకుంటాడని కొద్ది కాలం ఎదురుచూసీ చూసీ విసుగొచ్చిన దాదాకు ఓ ఆలోచన తట్టింది. అంతే.. ఇంగ్లాండ్​లో భారత క్రికెట్​ జట్టు పర్యటన ముగిసిన అనంతరం రిజిస్ట్రర్​ మ్యారేజ్​ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే.. ఆ ప్లాన్​ బెడిసికొట్టింది. కార్యాలయం వద్ద చాలా మంది నిరీక్షణలో ఉండటం వల్ల పెళ్లి జరగలేదు.

SOURAV GANGULY
కుటుంబంతో సౌరవ్​​ గంగూలీ

ఆ తర్వాత మరో షాకింగ్​ నిర్ణయం తీసుకుని, స్నేహితుడి ఇంట్లో రహస్య వివాహం చేసుకున్నాడు గంగూలీ. ఇరువురి ప్రేమపై ఎప్పుటినుంచో కోపంగా ఉన్న డోనా తల్లిదండ్రులు తొలుత ఆగ్రహించినా, చివరికి అంగీకరించక తప్పలేదు.

అధికారికంగా...

గంగూలీ-డోనాలకు పెళ్లి జరిగిన విషయం 6 నెలల వరకు బయటి సమాజానికి తెలియలేదు. వారికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో... ఓ స్థానిక వార్తాపత్రిక ఈ రహస్య వివాహాన్ని బయటపెట్టింది. దీంతో సౌరవ్​​​-డోనాలు దీనిని అంగీకరించాల్సి వచ్చింది.

ఇక చేసేదేం లేక వారి తల్లిదండ్రులు.. 1997 ఫిబ్రవరి 1న అధికారికంగా మరోసారి పెళ్లి జరిపించారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఇప్పుడీ జంట ఎంతో సంతోషంగా ఉంది. గంగూలీ-డోనా దంపతులకు సనా గంగూలీ అనే కూతురుంది.

SOURAV GANGULY
సౌరవ్​​ గంగూలీ

గంగూలీ కూడా తన క్రికెట్​ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం.. కీలక పదవులను అధిరోహించాడు. తొలుత బంగాల్​ క్రికెట్​ అసోసియేషన్​(క్యాబ్​) అధ్యక్షుడిగా.. ఇప్పుడు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్నాడు. ​

ఇదన్న మాట సంగతి. మన దాదా క్రికెట్లోనే కాదు.. ప్రేమ వ్యవహారంలోనూ దూకుడు ప్రదర్శించి నచ్చిన, మనసిచ్చిన అమ్మాయినే జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు.

ఇదీ చదవండి:Sourav Ganguly: టీమ్ఇండియాను మరోస్థాయికి తీసుకెళ్లిన సారథి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.