శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన సెంట్రల్ కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి ఆ దేశ సీనియర్ క్రికెటర్లు నిరాకరించారు. ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో పోల్చితే తమకిచ్చే మొత్తం చాలా తక్కువని వారు సంయుక్త ప్రకటన చేశారు. తాజా వివాదం పరిష్కారం కాకపోతే వచ్చే నెల ఇండియాతో జరిగే సిరీస్‌పై ప్రభావం పడనుంది.
టెస్ట్ కెప్టెన్ దిముత్ కరుణరత్నే సహా దినేష్ చండిమాల్, మాథ్యూస్‌కు ఈ కాంట్రాక్ట్‌పై సంతకాలు చేయడానికి.. జూన్ 3వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించింది బోర్డు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకారం.. ఇతర దేశాలతో పోల్చితే వీరికిచ్చే వేతనాలు మూడో వంతు అని వీరి తరఫున న్యాయ ప్రతినిధి వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇకపై రెండేళ్లకోసారి ఫిఫా ప్రపంచకప్!
మొత్తం 24 మంది ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విడగొట్టారు. ఏ-కేటగిరీలో ఆరుగురు క్రికెటర్లను చేర్చారు. వీరికి ఏడాదికి రూ.51 లక్షల నుంచి దాదాపు రూ.73 లక్షలుగా నిర్ణయించారు. సీ-కేటగిరీ(చిట్టచివరి) భారత క్రికెటర్లు ఏడాదికి కోటి రూపాయలు అందుకుంటున్నారు. దీనితో పోల్చితే లంక ఏ-కేటగిరీ ఆటగాళ్లు అందుకునేది తక్కువే.
శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి తాము దిగ్భ్రాంతికి లోనయ్యామని సీనియర్ క్రికెటర్లు సంయుక్తంగా ప్రకటించారు. వారి గత ప్రదర్శనల ఆధారంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని క్రికెట్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు అరవింద డిసిల్వా చెప్పడం గమనార్హం.
ఇదీ చదవండి: 'అసలు మాకు కరోనా ఎలా అంటుకుందో'