ETV Bharat / sports

Six Hitting Victory Matches : మోదీ మొన్న చెప్పారు.. మనోళ్లు ఎప్పుడో చేసేశారు.. క్రేజీ మ్యాచుల్లో.. - Srikar Bharat IPL

Six Hitting Victory Matches : వన్డేలు, టీ20 మ్యాచుల్లో చివరి బాల్​కు భారీ షాట్‌తో జట్టును గెలిపిస్తే ఆ మజానే వేరు. ఇరు జట్లకు కీలక మ్యాచుల్లో ఇది జరిగితే.. అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు. అలా మన భారత స్టార్‌ క్రికెటర్లు.. సిక్స్‌ బాది జట్టును గెలిపించిన సందర్భాలను గుర్తుచేసుకుందాం.

Six Hitting Victory Matches
Six Hitting Victory Matches
author img

By

Published : Aug 9, 2023, 3:46 PM IST

Six Hitting Victory Matches : 'చివరి బంతికి సిక్స్​ కొట్టండి'.. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా తమ కూటమి ఎంపీలకు సూచించారు. అయితే ఇదే మాటను టీమ్​ఇండియా తాత్కాలిక కెప్టెన్​ హార్దిక్​ పాండ్య బాగా పాటించాడు. విండీస్​తో జరిగిన మూడో టీ20లో సిక్స్​ బాది జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో.. సిక్స్​తో మ్యాచ్​లను ముగించిన సందర్భాలను ఓ సారి మనం గుర్తుచేసుకుందాం.

ధోనీ సిక్స్​ షాట్​.. ఎవర్​గ్రీన్​
2011 ODI World Cup Final Dhoni Six : 2011 వరల్డ్ కప్‌ టోర్నీలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ మహేంద్ర సింగ్​ ధోనీ నాయకత్వంలో స్వదేశంలో జరిగిన టోర్నీలో టీమ్​ఇండియా రెండో ప్రపంచకప్‌ అందుకుంది. అయితే 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోనీ స్టైల్‌గా సిక్స్‌ కొట్టిన విధానం క్రికెట్ అభిమానుల్లో ఇప్పటికీ అలా ఉండిపోయింది. ప్రత్యర్థి జట్టు0 శ్రీలంక నిర్దేశించిన 275 పరుగుల టార్గెట్‌ను 48.2 ఓవర్లలోనే భారత్ ఛేదించి కప్​ ఎగరేసుకుపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డీకే సిక్సూ.. నిదహాస్​ ట్రోఫీ మనదే
Dinesh Karthik Nidahas Trophy : 2018లో శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడింది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్​ఇండియా.. చివరి బంతికి గెలిచి నిదహాస్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. బంగ్లా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం. అయితే, ఐదు బంతులకు ఏడు రన్స్‌ రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. అప్పుడు లంక బౌలర్​ సౌమ్యా సర్కార్‌ వేసిన ఈ ఓవర్‌ ఆఖరి బంతిని దినేశ్‌ కార్తిక్‌ సిక్స్‌గా మలిచిన తీరు అభిమానులను కట్టిపడేసింది.

హార్దిక్​ దెబ్బ.. పాక్​ అబ్బా..
Asia Cup Hardik Shot : గతేడాది జరిగిన ఆసియకప్​లో టీమ్​ఇండియా ప్రదర్శన నిరాశపరిచినా.. పాక్​పై గెలవడం మాత్రం అభిమానులకు గుర్తుండిపోయింది. ముఖ్యంగా పాకిస్థాన్‌ నిర్దేశించిన 148 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ కూడా చివర్లో ఇబ్బంది పడేలా కనిపించింది. కానీ హార్దిక్‌ పాండ్య.. 17 బంతుల్లోనే 33 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్​లో కూడా..
IPL Six Hitting Victory Matches : అంతర్జాతీయ మ్యాచుల్లోనే కాదు.. మనోళ్లు ఐపీఎల్​లోనూ చివరి బంతికి సిక్స్​లు బాది తమ తమ జట్లను విజయతీరాలకు చేర్చారు. క్రికెట్​ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఐదు సిక్స్‌ల రింకు..
Rinku Singh Sixes IPL 2023 : 2023 ఐపీఎల్​లో సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన ఆటగాడు కేకేఆర్‌ బ్యాటర్ రింకు సింగ్‌. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌ యశ్‌ దయాల్ వేసిన చివరి ఓవర్‌లో రింకు దుమ్మురేపాడు. కోల్​కతా విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి గెలిపించాడు.

రషీద్​ ఖాన్​ అదుర్స్​
IPL 2022 Rashid Khan : అనేక సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడిన రషీద్ ఖాన్‌ గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో హైదరాబాద్‌పైనే దూకుడైన ఇన్నింగ్స్‌ ఆడి గుజరాత్‌ను గెలిపించాడు. చివరి రెండు బంతుల్లో 9 పరుగులు అవసరమైన వేళ వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు.

మార్మోగిన తెవాదియా పేరు..
IPL 2022 Rahul Tewatia : 2022 ఐపీఎల్​ సీజన్​లో రాహుల్​ తెవాతియా పేరు.. మార్మోగిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి రెండు బంతుల్లో సిక్స్‌లు కొట్టిన తెవాతియా ఓటమి నుంచి గుజరాత్‌ను గట్టెక్కించాడు. రెండు బంతుల్లో రెండు సిక్స్‌లు కొడితేనే గుజరాత్‌ విజయం సాధించే పరిస్థితి. ఆశలన్నీ కోల్పోయిన వేళ తెవాతియా అసాధారణ రీతిలో రెండు సిక్స్‌లు కొట్టేశాడు.

కోల్‌కతాకు జడ్డూ షాక్​
IPL 2023 Final Jadeja : 2023 ఫైనల్​లో గుజరాత్​పై సిక్స్, ఫోర్​ కొట్టి.. చెన్నైకు కప్​ అందించాడు ఆల్​రౌండర్​ జడేజా. 2020 సీజన్‌లోనూ కోల్‌కతాపై వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు.

పంజాబ్‌పై ధోనీ
Dhoni Sixes : కీలకమైన సమయంలో భారీ సిక్స్‌లు కొట్టడం ధోనీ స్పెషాలిటీ. అంతర్జాతీయంలోనే కాకుండా ఐపీఎల్‌లోనూ ఇలాంటి ఫీట్లు సాధించాడు. రైజింగ్‌ పుణె జట్టు తరఫున 2016లో బరిలోకి దిగిన ధోనీ పంజాబ్‌ కింగ్స్‌పై ఇలానే సిక్స్‌తో జట్టును గెలిపించాడు.

శ్రీకర్‌ ఖాతాలోనూ అరుదైన ఫీట్
Srikar Bharat IPL : తెలుగు తేజం శ్రీకర్‌ భరత్‌ కూడా ఐపీఎల్‌లో సిక్స్‌తో తన జట్టును గెలిపించాడు. ఆర్‌సీబీ తరఫున ఆడిన భరత్‌ 2021 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై అర్ధశతకంతో (78*) చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు. చివరి బంతికి సిక్స్‌ అవసరమైన సందర్భంలో అవేశ్‌ ఖాన్‌ వేసిన ఓవర్‌లో శ్రీకర్‌ భరత్‌ సూపర్‌ సిక్స్‌ కొట్టాడు.

రోహిత్ శర్మ కూడా..
IPL 2023 Rohit Sharma : ముంబయి ఇండియన్స్‌ జట్టు తరఫున 2012 సీజన్‌ నుంచి ఆడిన రోహిత్ శర్మ. డెక్కన్ ఛార్జర్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 3 బంతుల్లోనే 11 పరుగులు అవసరమైనప్పుడు రోహిత్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.