ETV Bharat / sports

Siraj Asia Cup 2023 : ఒకే ఓవర్ నాలుగు వికెట్లు.. సిరాజ్ రియాక్షన్​!

Siraj Asia Cup 2023 : ఆసియా కప్ 2023 ఫైనల్​లో తన అసాధారణమైన ప్రదర్శనపై మాట్లాడాడు సిరాజ్. ఏమన్నాడంటే?

Siraj Asia Cup 2023 : ఒకే ఓవర్ నాలుగు వికెట్లు..  సిరాజ్ రియాక్షన్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 10:27 AM IST

Siraj Asia Cup 2023 : ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్​లో ఏకంగా 6 వికెట్లతో చెలరేగిపోయాడు టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్​ సిరాజ్. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అతడు.. మరో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. దీంతో లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. టీమ్​ ఇండియా విజయం సాధించింది. అయితే ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు సిరాజ్​. ఇదంతా ఓ కలలా ఉందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తాను పెద్దగా కష్టపడింది కూడా ఏం లేదని అన్నాడు.

"ఇదంతా కలలా అనిపిస్తోంది. గతంలో తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభంలోనే నాలుగు వికెట్లు తీశాను. కానీ ఐదు వికెట్ల ఘనతను అందుకోలేకపోయాను. ఈ రోజు నేను పెద్దగా కష్టపడలేదు. వైట్ బాల్ క్రికెట్‌లో ఎప్పుడూ నేను స్వింగ్ బాల్స్ సంధిస్తాను. ఈ టోర్నీలోని గత మ్యాచ్‌ల్లో పెద్దగా స్వింగ్ దొరకలేదు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం బంతి అద్భుతంగా స్వింగ్ అయింది. కానీ నేను ఔట్ స్వింగర్లతోనే వికెట్లు తీశాను. బ్యాటర్లతో డ్రైవ్ షాట్ ఆడేలా చేసి వికెట్లు తీశాను పడగొట్టాను." అని సిరాజ్ పేర్కొన్నాడు.

కాగా, సిరాజ్​ ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి.. ఆ ఘనత అందుకున్న ఫస్ట్ భారత బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ ఓవర్‌ వేశాడు. ఒక్కో బంతిని ఒక్కోలా సంధించి.. బ్యాటర్లను సిరాజ్‌ బోల్తా కొట్టించాడు. ఫస్ట్​, థర్డ్​, ఫోర్త్​, సిక్త్​ బాల్స్​కు వికెట్లను తీశాడు. మొత్తంగా నిప్పులు చెరిగి నాలుగు వికెట్ల వీరుడిగా నిలిచాడు.

ఫైనల్​ అతడి దెబ్బకు 50 ఓవర్ల మ్యాచ్‌ కాస్తా 50 పరుగుల పోరుగా మారిపోయింది. లక్ష్యాన్ని టీమ్​ఇండియా 6.1 ఓవర్లలోనే ఛేదించింది. ఫలితంగా ఎనిమిదోసారి ఆసియా కప్‌ విజేతగా నిలిచింది టీమ్​ఇండియా. వరల్డ్ కప్​నకు ముందు ఈ సూపర్​ సక్సెస్​ జట్టుకు గొప్ప ఉత్సాహాన్నిచ్చేదే అని చెప్పాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Siraj 2023 Performance : సిరాజసం.. ఈ ఏడాది మియా భాయ్​ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Siraj 6 Wickets : వారెవ్వా సి'రాజ్​'.. మియాభాయ్ హిట్.. లంక ఫట్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.