Shubman Gill Selfie With Lion : దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా టీ20, వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించింది. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను 1-1తో సమం చేయగా, వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక టెస్టు సమరానికి సిద్ధమైంది. ఈ సిరీస్ ఎలా అయినా గెలవాలని శ్రమిస్తోంది.
ట్రిప్‌కు టీమ్ఇండియా ప్లేయర్లు!
తాజాగా కొందరు టీమ్ఇండియా ప్లేయర్లు స్పెషల్ ట్రిప్‌కు వెళ్లారు. దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలను చుట్టేశారు. ఆ సమయంలో ఫారెస్ట్ సఫారీకి యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు టీమ్ఇండియా సిబ్బంది రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథూర్, టీ దిలీప్ వెళ్లారు. వారందరూ ఖడ్గమృగంతో కలిసి ఫొటోకు ఫోజులు ఇచ్చారు. రైనో మీద చేతులు వేసి సరదాగా గడిపారు.
అయితే గిల్ మాత్రం ఏకంగా సెల్ఫీ దిగాడు. పర్యటకుల వాహనం నుంచి ఫొటో తీసుకున్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు గిల్ ఫొటోపై రకరకాలు స్పందిస్తున్నారు. సింహంతో మరో సింహం అని, ఫొటోలో ఉన్న ఇద్దరు టీమ్ఇండియా ఓపెనర్లు అని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ ముందు ఇలాంటి సాహసాలు అవసరమా? అని కొందరు అంటున్నారు. గిల్ ఇంతటోడవు అనుకోలేదని మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
-
Safari time for Shubman Gill 🐊🐅🐆🐃🦒🚘
— CricTracker (@Cricketracker) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📸: Shubman Gill pic.twitter.com/0oLOsL3rnB
">Safari time for Shubman Gill 🐊🐅🐆🐃🦒🚘
— CricTracker (@Cricketracker) December 24, 2023
📸: Shubman Gill pic.twitter.com/0oLOsL3rnBSafari time for Shubman Gill 🐊🐅🐆🐃🦒🚘
— CricTracker (@Cricketracker) December 24, 2023
📸: Shubman Gill pic.twitter.com/0oLOsL3rnB
ఒక్కసారి కూడా!
ఇప్పటివరకు సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్‌ను భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1992 నుంచి ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత్ 8 టెస్టు సిరీస్‌లాడింది. కానీ ఏడింట్లో పరాజయం పాలైంది. ఓ సిరీస్‌ను మాత్రం డ్రాగా ముగించింది. ఈ సారి సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది.
డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. చివరి టెస్టు కేప్‌టౌన్‌లో జనవరి 3వ తేదీన మొదలవుతుంది. అయితే తొలి టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం వల్ల తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముంంది. రెండో రోజు కూడా చాలా ఓవర్ల ఆట నష్టం జరగొచ్చు. ఇక పిచ్ విషయానికొస్తే ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది.
'కెప్టెన్సీలో రాణించాలంటే విధేయత కూడా ఉండాలి' - గిల్ కామెంట్స్ అతడ్ని ఉద్దేశించేనా?
శుభమన్ కోసమే ఎక్కువ మంది సెర్చ్ చేశారట- గిల్‌కు 2023 బాగా కలిసొచ్చిందిగా!