ETV Bharat / sports

పాపం శ్రేయస్​ అయ్యర్.. అనుకున్నదే జరిగిందిగా! - శ్రేయస్ అయ్యర్​ వెన్ను గాయం

వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్​ అయ్యర్​.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్​, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్​కు దూరం కానున్నాడు. ఆ వివరాలు..

Shreyas Iyer ipl 2023
పాపం శ్రేయస్​ అయ్యర్.. అనుకున్నదే జరిగిందిగా!
author img

By

Published : Mar 22, 2023, 6:25 PM IST

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్​, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్​ ముందు అటు టీమ్​ఇండియాకు, ఇటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనుకున్నట్టే వెన్ను గాయం కారణంగా కేకేఆర్ కెప్టెన్, టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ తాజా సీజన్​కు దూరం అయ్యాడు. అయ్యర్‌కు శస్త్రచికిత్స జరగాల్సి ఉన్న కారణంగా ఈ మెగాటోర్నీ ఆడడం లేదు. దీంతోపాటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయాన్ని ఓ నేషనల్​ మీడియా తెలిపింది.

ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడట. శస్త్రచికిత్స అనంతరం అతడు కోలుకోవడానికి 4-5 నెలల సమయం పట్టే అవకాశముంది. ఈ గాయానికి అయ్యర్ లండన్‌లో గానీ లేదా మరో చోట గానీ సర్జరీ చేయించుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023, వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కు అయ్యర్ దూరం కావాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది భారత వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

కాగా, వెన్ను సమస్య కారణంగానే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్ బరిలోకి దిగలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్​లోనూ.. తొలి మ్యాచ్​లో అయ్యర్ ఆడలేదు. అయితే రెండు, మూడు టెస్టుల్లో మాత్రం బ్యాటింగ్ చేశాడు. అయితే వెన్ను నొప్పి బాధిస్తుండడం వల్ల నాలుగో మ్యాచ్​లో బ్యాటింగ్ చేయలేదు. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్​కు అతడికి చోటు దక్కింది. కానీ వెన్ను గాయం తగ్గకపోవడంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాడు. కానీ సూర్య ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు.

ఇకపోతే కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఫ్రాంచైజీ శ్రేయస్​ అయ్యను రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడిని కెప్టెన్​గా కూడా నియమించింది. కానీ ఇప్పుడు అయ్యర్ వెన్ను గాయం కారణంగా కేకేఆర్​కు కొత్త కెప్టెన్​ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్​ రేసులో ఈ మధ్యలో షకిబ్ అల్ హసన్​, రింకూ సింగ్​, ఆండ్రూ రసెల్ పేర్లు వినిపించాయి. దీనిపై అభిమానుల్లో తెగ ఆసక్తి నెలకొంది. ఇక వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ విషయానికొస్తే.. అయ్యర్ స్థానంలో దేశవాళీ క్రికెట్ హీరో సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకునే అవకాశముంది.

ఇదీ చూడండి: నెం.1 ర్యాంకును కోల్పోయిన సిరాజ్​.. గ్రౌండ్​లోనే మండిపడ్డ రోహిత్, కోహ్లీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.