ETV Bharat / sports

తొలి టెస్టులో శ్రేయస్ సెంచరీ.. భారత 16వ క్రికెటర్​గా ఘనత - శ్రేయస్ అయ్యర్ న్యూస్ టుడే

Shreyas Iyer Century: న్యూజిలాండ్, భారత్ తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. భారత్​ తరఫున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన 16వ బ్యాటర్​గా నిలిచాడు.

shreyas iyer
శ్రేయస్ అయ్యర్
author img

By

Published : Nov 26, 2021, 10:17 AM IST

Updated : Nov 26, 2021, 11:26 AM IST

Shreyas Iyer Century: న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో భాగంగా టీమ్​ఇండియా(IND vs NZ 1st test) జట్టులో అవకాశం దక్కించుకున్నాడు యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. తొలి టెస్టులోనే శతకం నమోదు చేసిన 16వ భారత ఆటగాడిగా నిలిచాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

టిమ్​ సౌథీ వేసిన 92వ ఓవర్లో రెండు పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు శ్రేయస్. 2018లో వెస్టిండీస్​ టెస్టుతో ఆరంగేట్రం చేసిన పృథ్వీ షా తొలి టెస్టులోనే 134 పరుగులు చేసి.. సెంచరీ చేసిన 15వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాపై 187 పరుగులు చేసిన శిఖర్​ ధావన్​.. అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇండియా బ్యాటర్​గా నిలిచాడు.

గతంలో గంగూలీ, సెహ్వాగ్, సురేశ్ రైనా కూడా తొలి టెస్టులోనే సెంచరీ బాదిన జాబితాలో ఉన్నారు.

రెండో రోజు..

రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక ఆదిలోనే టీమ్​ఇండియాకు దెబ్బపడింది. తొలి రోజు శ్రేయస్​తో కలిసి కీలక ఇన్నింగ్స్​ ఆడిన ఆల్​రౌండర్ జడేజా(50) రెండో రోజు ఆరంభంలోనే సౌథీ బౌలింగ్​లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా నిరాశపరిచాడు.

ఇదీ చదవండి:

శ్రేయస్​ తండ్రి వాట్సాప్​ డీపీ నాలుగేళ్లుగా ఆ ఫొటోనే?

Last Updated : Nov 26, 2021, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.