Shot Of The Century Kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లి మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలోనే మరే బ్యాటర్ సాధించని ఘనతను కోహ్లీ అందుకున్నాడు. దీనిని స్వయంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వెల్లడించింది. గతేడాది(2022) ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ మైదానంలో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కొట్టిన ఓ సిక్స్‌ను.. ఈ శతాబ్దంలోనే మేటి షాట్ (షాట్ ఆఫ్ ది సెంచరీ)గా ఐసీసీ ప్రకటించింది.
ఈ మ్యాచ్‌లో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడి.. మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే ఈ హాఫ్ సెంచరీని పూర్తి చేసే క్రమంలో విరాట్ ఓ భారీ షాట్‌ను ఆడాడు. పాక్ పేసర్ హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో అతడు స్ట్రెయిట్ డ్రైవ్‌లో అద్భుతమైన సిక్స్‌ను బాదాడు. ఈ సిక్స్ షాట్‌నే తాజాగా ఐసీసీ 'షాట్ ఆఫ్ ది సెంచరీ'గా ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 8 బాల్స్‌లో 28 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలోనే రౌఫ్ వేసిన 19వ ఓవర్ చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టాడు విరాట్. ఈ దూకుడే భారత్‌ను 4 వికెట్ల తేడాతో గెలిచేలా చేసింది. ఇక ఈ 'షాట్ ఆఫ్ ది సెంచరీ'కి సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
-
SHOT OF THE CENTURY🔥pic.twitter.com/YgWhmbC5Fi
— 18™ (@KohliVideoBot) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">SHOT OF THE CENTURY🔥pic.twitter.com/YgWhmbC5Fi
— 18™ (@KohliVideoBot) November 7, 2023SHOT OF THE CENTURY🔥pic.twitter.com/YgWhmbC5Fi
— 18™ (@KohliVideoBot) November 7, 2023
సచిన్ సరసన విరాట్..
Virat 49 Hundred : ఇదిలాఉంటే సొంతగడ్డపై జరుగుతున్న 2023 ప్రపంచకప్ మోగా టోర్నీలో విరాట్ తన విశ్వరూపాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 101 పరుగులు సాధించాడు. దీంతో అతడు తన వన్డే క్రికెట్ కెరీర్లో 49వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా తన 35వ పుట్టినరోజు నాడే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఇక క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న వన్డే 49వ సెంచరీని కింగ్ సమం చేశాడు. అయితే ఈ ఫీట్‌ను సచిన్ తన 452వ ఇన్నింగ్స్‌లో అందుకోగా.. విరాట్ మాత్రం కేవలం తన 277వ ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు సాధించాడు. సచిన్ రికార్డును సమం చేయడంతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
-
Presenting "SHOT OF THE CENTURY"...!!!!!
— CricketMAN2 (@ImTanujSingh) November 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ICC rated Virat Kohli's Six against Haris Rauf at MCG as 'Shot of the Century' - King Kohli, The 🐐. pic.twitter.com/ZqXQvoM8KY
">Presenting "SHOT OF THE CENTURY"...!!!!!
— CricketMAN2 (@ImTanujSingh) November 7, 2023
ICC rated Virat Kohli's Six against Haris Rauf at MCG as 'Shot of the Century' - King Kohli, The 🐐. pic.twitter.com/ZqXQvoM8KYPresenting "SHOT OF THE CENTURY"...!!!!!
— CricketMAN2 (@ImTanujSingh) November 7, 2023
ICC rated Virat Kohli's Six against Haris Rauf at MCG as 'Shot of the Century' - King Kohli, The 🐐. pic.twitter.com/ZqXQvoM8KY
విరాట్ ట్రాక్ రికార్డ్..
1988 నవంబర్ 5న రాజధాని దిల్లీలో జన్మించిన విరాట్ ఆదివారం తన 35వ ఏట అడుగుపెట్టాడు. తన అత్యద్భుతమైన ఆటతీరుతో ఇప్పటికే ఉన్న క్రికెట్ దిగ్గజాల జాబితాలో చోటు సంపాదించాడు. ఇప్పటివరకు తన క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని 79 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 26,209 పరుగులు చేశాడు. ఇందులో 111 టెస్టుల్లో 8,676 రన్స్, 288 వన్డేల్లో 13,525, 115 టీ20ల్లో 4,008 పరుగులు ఉన్నాయి.
'బాల్ ఆఫ్ ది సెంచరీ..'
ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ వేసిన ఓ సూపర్ బంతిని ఇప్పటికే 'బాల్ ఆఫ్ ది సెంచరీ'గా గుర్తించింది ఐసీసీ.
అదరగొట్టిన అఫ్గాన్ బ్యాటర్లు - ఆసీస్ ముందు భారీ లక్ష్యం!
మాక్స్వెల్ 'వన్‌మ్యాన్ షో'- డబుల్ సెంచరీతో వీరవిహారం, అఫ్గాన్‌పై ఆసీస్ విజయం