ETV Bharat / sports

కోహ్లీ, బాబర్​ లేకుండానే అక్తర్​ 'ఆల్​టైం వన్డే XI' - విరాట్​ కోహ్లీ

ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లతో ఆల్​టైం వన్డే క్రికెట్​ టీమ్​ను ఎంపిక చేశాడు పాకిస్థాన్​ మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్​. అందులో నలుగురు టీమ్ఇండియా క్రికెటర్లు ఉండగా.. నలుగురు పాకిస్థాన్​ క్రికెటర్లను ఎంపిక చేశాడు. అయితే ఈ టీమ్​లో ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​-2లో బాబర్​ అజామ్​, విరాట్​ కోహ్లీలకు అక్తర్​ చోటివ్వలేదు.

Shoaib Akhtar selects his all-time ODI XI, excludes Virat Kohli and Babar Azam
టీమ్ఇండియా కెప్టెన్​ కోహ్లీ లేకుండానే వన్డే జట్టు
author img

By

Published : Jul 18, 2021, 1:25 PM IST

ఆటకు వీడ్కోలు పలికినా.. తన యూట్యూబ్​ ఛానల్​ ద్వారా అప్పుడప్పుడు క్రికెట్​పై తన అభిప్రాయాలను తెలియజేస్తున్నాడు పాకిస్థాన్​ మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్​. ఇటీవలే తన యూట్యూబ్​ ఛానల్​లో మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లతో ఓ వన్డే జట్టును ఎంపిక చేశాడు. అందులో నలుగురు పాక్​ ఆటగాళ్లు ఉండగా.. నలుగురు భారత క్రికెటర్లకు జట్టులో స్థానం కల్పించాడు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్​, భారత్ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తూ.. వన్డే ర్యాంకింగ్స్​లో నెం.1,2 లుగా ఉన్న బాబర్​ అజామ్​, విరాట్​ కోహ్లీలకు.. అక్తర్​ తన జట్టులో స్థానం కల్పించలేదు. ​

తాను ఎంపిక చేసిన ఉత్తమ వన్డే జట్టులో గోర్డాన్ గ్రీనిడ్జ్(వెస్టిండీస్​), సచిన్​ తెందుల్కర్​లను ఓపెనర్లుగా ఎంపిక చేయగా.. ఆ తర్వాత 3, 4వ స్థానాల్లో పాక్​ మాజీ కెప్టెన్ ఇంజమామ్​, మాజీ బ్యాట్స్​మన్​ సయీద్​ అన్వర్​లను తీసుకున్నాడు. అయితే వీరిద్దరిలో ఇంజమామ్​ బ్యాటింగ్​ స్థానం మారకపోయినా.. ఓపెనింగ్​ బ్యాటింగ్​ చేసే అన్వర్​కు 4వ స్థానాన్ని కేటాయించాడు అక్తర్​. సయీద్​ అన్వర్​ మిడిల్​ ఆర్డర్​లో బ్యాటింగ్​ చేస్తే పరుగులు రాబట్టడం సహా బౌలర్లను దీటుగా అడ్డుకోగలడని అక్తర్​ చెప్పాడు.

కెప్టెన్​గా వార్న్​..

ఈ జట్టుకు కెప్టెన్​గా ఆస్ట్రేలియా బౌలర్​ షేన్​ వార్న్​ను ఎంపికచేశాడు షోయబ్​ అక్తర్​. మరోవైపు భారత లెజండరీ ఆల్​రౌండర్​ కపిల్​ దేవ్​ను ఫాస్ట్​ బౌలర్​ జాబితాలో చేర్చాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎం.ఎస్​.ధోనీని వికెట్​ కీపర్​గా జట్టులోకి తీసుకున్నాడు. వీరితో పాటు 6వ స్థానంలో ఆడమ్​ గిల్​క్రిస్ట్​, ఏడులో యువరాజ్​ సింగ్​కు చోటు కల్పించాడు.

షోయబ్​ అక్తర్​ ఎంపిక చేసిన ఆల్​టైమ్​ వన్డే టీమ్​

గోర్డాన్ గ్రీనిడ్జ్, సచిన్​ తెందుల్కర్​, ఇంజమామ్​-ఉల్​-హక్​, సయీద్​ అన్వర్​, ఎం.ఎస్​.ధోనీ, ఆడమ్​ గిల్​క్రిస్ట్​, యువరాజ్​ సింగ్​, వసీమ్ అక్రమ్​, వకార్​ యూనిస్​, కపిల్​ దేవ్​, షేన్​ వార్న్​ (కెప్టెన్​) .

ఇదీ చూడండి.. భారత క్రికెటర్లకు కెప్టెన్​గా ఇమ్రాన్​ఖాన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.