Shoaib Akhtar on Kohli Marriage: 'కోహ్లీ స్థానంలో నేను ఉండి ఉంటే పెళ్లి చేసుకునేవాడిని కాదు. ఆటపై మాత్రమే పూర్తి దృష్టి సారించేవాడిని' అని అన్నాడు పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. వివాహం ఆటగాడి జీవితంలో మరింత బాధ్యతను పెంచుతుందని పేర్కొన్నాడు. విరాట్ కెప్టెన్‌గా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని చెప్పాడు.
"ఏది తప్పు ఏది కరెక్ట్ నాకు తేలీదు. కోహ్లీ 7ఏళ్ల నుంచి కెప్టెన్‌గా ఉన్నాడు. నేనెప్పుడు అతడు సారథిగా ఉండాలని అనుకోలేదు. అతడు బ్యాటింగ్‌పై దృష్టి సారించి.. 100 నుంచి 120 పరుగులు చేయాలని భావించేవాడిని. అతడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అనేది నా భావన. అదే నేను భారత ఫాస్ట్ బౌలర్ అయితే వివాహం చేసుకునే వాడిని కాదు. కేవలం క్రికెట్‌పై మాత్రమే దృష్టి పెట్టేవాడిని. కానీ అది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. కోహ్లీ 120 సెంచరీలు చేసిన తర్వాత పెళ్లి చేసుకుని ఉండే బాగుండేది. అభిమానులకు అతడంటే పిచ్చి. మరో 20ఏళ్లు అతడు క్రికెట్లో కొనసాగాలి."
-షోయబ్ అక్తర్.
కోహ్లీ.. కెప్టెన్సీ విషయంలో తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల్ని పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని హితవు పిలికాడు. సారథ్యం అంత సులువైన విషయం కాదని.. తీవ్ర ఒత్తిడి మధ్య బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయని.. కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!