ETV Bharat / sports

'న్యూజిలాండ్​ టీమ్ అంతు చూడాల్సిందే' - న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్​ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్​ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్(Shoaib Akhtar News).. న్యూజిలాండ్​ జట్టును హెచ్చరించాడు. ఆఖరి నిమిషంలో పాకిస్థాన్​ పర్యటన రద్దు చేసిన కారణంగా న్యూజిలాండ్​పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

shoaib akhthar
షోయబ్ అక్తర్
author img

By

Published : Sep 21, 2021, 9:59 PM IST

భద్రత కారణాలతో చివరి క్షణాల్లో పాకిస్థాన్​ పర్యటనను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది న్యూజిలాండ్ క్రికెట్(New Zealand Tour of Pakistan). ఈ నిర్ణయంపై పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా రావల్పిండి ఎక్స్​ప్రెస్, పాక్ మాజీ ఫాస్ట్​ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar News) దీనిపై స్పందించాడు. న్యూజిలాండ్​కు పలు హెచ్చరికలు చేశాడు.

దుబాయి వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​లో కివీస్​ జట్టు అంతు చూడాలని పాకిస్థాన్ సారథి బాబర్ ఆజామ్​కు సందేశం ఇచ్చాడు. ఇంగ్లాండ్​ కూడా తమ పాక్​ పర్యటనను రద్దు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంజా విసిరే సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశాడు.

యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబరు 17నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చదవండి:

'న్యూజిలాండ్.. పాక్​ క్రికెట్​ను​ చంపేసింది'

మైదానంలో దిగిన హెలికాప్టర్.. మ్యాచ్​కు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.