ETV Bharat / sports

భారత్, పాక్ మ్యాచ్ నాకు నచ్చలేదు, షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

ఆదివారం జరిగిన మ్యాచ్​లో భారత్​ విజయంపై ఒక పక్క ప్రశంసల వర్షం కురుస్తుండగా మరో పక్క దాయాది దేశాల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మాజీ పాక్​ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. అసలు ఆయన ఏమన్నారంటే

shoiab akhtar
shoiab akhtar
author img

By

Published : Aug 29, 2022, 9:22 PM IST

భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా తిలకించారు. ఉత్కంఠపోరులో టీమ్‌ఇండియా గెలిచింది. దీంతో భారత్‌లో సంబరాలు అంబరాలను తాకాయి. అయితే ఒకరు మాత్రం మ్యాచ్‌ జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకీ అతడు ఎవరనేగా మీ డౌటు..? ఆయన మరెవరో కాదు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌. అవును దాయాదుల పోరు తనను ఆకట్టుకోలేదని, ఇరు జట్లూ ఓడిపోవాలని ప్రయత్నించాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 'క్రికెట్‌కు బ్యాడ్‌ డే' అంటూ తన ఆక్రోశాన్ని తెలియజేసారు.

"భారత్, పాకిస్థాన్‌ జట్లకు శుభాకాంక్షలు చెబుతున్నా. ఎందుకంటే ఇరు జట్లూ గేమ్‌ ఓడిపోవడానికి ప్రయత్నించాయి. భారత్‌ దాదాపు విజయవంతమైంది. కానీ హార్దిక్‌ పాండ్య అడ్డుగా నిలిచాడు. ఎందుకు ఇలా చెబుతున్నానంటే.. రిజ్వాన్‌ 42 బంతుల్లో 43 పరుగులు చేయడం ఆశ్చర్యం కలిగించకమానదు. పాక్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో తొలి ఆరు ఓవర్లలో 19 డాట్‌ బాల్స్‌ పడ్డాయి. ఎక్కువ డాట్‌ బాల్స్‌ ఆడితే ఇబ్బందుల్లో పడినట్లే. అలానే ఇద్దరు సారథులు తమ జట్టు ఎంపికను సరిగా చేయలేదు. రిషభ్‌ పంత్‌ను భారత్‌ పక్కన పెట్టేసింది. పాకిస్థాన్‌ మాత్రం ఇఫ్తికార్‌ అహ్మద్‌ను నాలుగో స్థానానికి పంపింది. అతడిని అగౌరవపరచాలనే ఉద్దేశం నాకు లేదు" అని అక్తర్​ విమర్శించారు.

"బాబర్ అజామ్‌ ఓపెనింగ్‌కు రావొద్దని ఇప్పటికే చాలాసార్లు చెప్పా. అతడు వన్‌డౌన్‌లో వచ్చి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఫఖర్‌ జమాన్‌,రిజ్వాన్‌ తప్పనిసరిగా ఓపెనర్లుగా రావాలి. భారత్‌, పాక్‌ జట్లు బ్యాడ్ క్రికెట్‌ను ఆడాయి. పాక్‌ తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను సరిచేయలేదు. అలానే భారత్‌ కూడా రవీంద్ర జడేజాను నాలుగో స్థానంలో పంపింది. ఇరు జట్లూ భారీ తప్పిదాలు చేశాయి. అందుకే ఇది క్రికెట్‌కు బ్యాడ్‌ డే అని అంటా. ఇరు జట్లూ దారుణంగా క్రికెట్‌ ఆడాయి. నాకైతే నచ్చలేదు. ఎవరు ఏమనుకున్నా సరే లెక్కచేయను" అని తన యూట్యూబ్ ఛానల్‌లో షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

సేమ్​ టోర్నీ అదే జట్టు, నాడు స్ట్రెచర్‌పై ఆస్పత్రికి, ఇప్పుడు చెలరేగిపోయి

అలా చేయడం వల్లే వికెట్లు దక్కాయన్న హార్దిక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.