ETV Bharat / sports

టీమ్​ఇండియా లెజెండ్స్​తో షోయబ్​.. ట్వీట్ వైరల్​ - టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా

టీ20 ప్రపంచకప్​లో భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​(India vs Pakistan world cup 2021) ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్​ అక్టోబర్ 24న జరగనున్న నేపథ్యంలో టీమ్​ఇండియా, పాకిస్థాన్​ దిగ్గజ క్రికెటర్లు యూఏఈకి చేరుకున్నారు. ఈ సందర్భంగా షోయబ్ అక్తర్(shoaib akhtar news) చేసిన ఓ ట్వీట్​ వైరల్​గా మారింది.

shoaib akhtar
షోయబ్ అక్తర్
author img

By

Published : Oct 17, 2021, 9:06 PM IST

టీమ్​ఇండియా, పాకిస్థాన్​ మ్యాచ్(India vs Pakistan world cup 2021)​ అంటే అభిమానులకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. అయితే.. అక్టోబర్ 24న ఈ మ్యాచ్​ జరగనున్న నేపథ్యంలో క్రికెట్ దిగ్గజాలు యూఏఈకి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీమ్​ఇండియా లెజెండ్స్ కపిల్ దేవ్, సునీల్ గావస్కర్​లతో సరదాగా గడుపుతున్న ఓ ఫొటోను పోస్ట్​ చేశాడు పాకిస్థాన్​ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(shoaib akhtar news). ఈ ట్విట్టర్​ పోస్ట్​కు ఓ ఆసక్తికరమైన కాప్షన్ జోడించాడు.

"అత్యుత్తమ ఆటగాళ్లతో చిల్ కొడుతున్నా. ద గ్రేట్ జహీర్ అబ్బాస్, సునీల్ గావస్కర్, కపిల్​ దేవ్​తో సమయం గడిపాను. క్రికెట్​ మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది."

--షోయబ్ అక్తర్, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్.

ఈ ట్వీట్​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అయితే.. వరల్డ్​ కప్​ మ్యాచ్​ల్లో పాకిస్థాన్​ ఎప్పుడూ భారత్​ను ఓడించలేదు. ఈ నేపథ్యంలో దుబాయ్​ వేదికగా టీమ్​ఇండియాను తప్పకుండా ఓడిస్తామని ఇటీవలే పాకిస్థాన్​ సారథి బాబర్ ఆజామ్ వ్యాఖ్యానించాడు.

మరోవైపు.. అన్ని మ్యాచ్​ల్లానే భారత్-పాకిస్థాన్​ మ్యాచ్​ ఉంటుందని టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదీ చదవండి:

కోహ్లీకి తెలియకుండానే టీమ్​ఇండియా కోచ్​గా ద్రవిడ్?

'పాక్​తో మ్యాచ్.. టీమ్​ఇండియాకే సానుకూలత ఎక్కువ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.