Shaun Marsh Retirement : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, బిగ్‌బాష్ లీగ్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ షాన్ మార్ష్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఫామ్‌లో(బిగ్‌బాష్ లీగ్) ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు అనౌన్స్ చేశాడు. బుధవారం సిడ్నీ థండర్‌తో జరిగే మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని పేర్కొన్నాడు. గతేడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మార్ష్ తాజాగా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ నుంచి వైదొలగాలని డెసిషన్ తీసుకున్నట్లు వెల్లడించాడు. మంచి ఫామ్‌లో ఉన్న మార్ష్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం వల్ల అతడి అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.
"నేను రెనెగేడ్స్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతో ఇష్టపడ్డాను. జట్టులోని సహచరులు అంతా నాకు మంచి స్నేహితులు. వీరందరితో నా స్నేహం జీవితాంతం గుర్తుండి పోతుంది. ఈ జర్నీలో అండగా నిలిచిన కోచ్‌లు, సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు." అని మార్ష్ ఓ ప్రకటనలో తెలిపారు.
Shaun Marsh Stats : ఇకపోతే 40 ఏళ్ల షాన్ మార్ష్ 2019 నుంచి ఆస్ట్రేలియా జట్టుకు దూరమయ్యాడు. వార్నర్, స్మిత్ నిషేధానికి గురైనప్పుడు టీమ్‌లో మార్ష్ కీలకపాత్ర పోషించాడు. అయితే 2019 వరల్డ్ కప్‌లో గాయపడ్డ మార్ష్ తిరిగి ఆసీస్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. కరోనాతో ఆటలకు అంతరాయం కలగడం కూడా అతడి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. మొత్తంగా 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడాడు. ఆ తర్వాత లీగ్ క్రికెట్ మాత్రమే ఆడుతున్న మార్ష్ గతేడాది మార్చిలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు క్రికెట్ మొత్తానికి వీడ్కోలు పలికాడు.
కాగా, ఐపీఎల్లో షాన్ మార్ష్ కీలక ఆటగాడిగా కొనసాగాడు. 2008- 2017 వరకు అతడు ఐపీఎల్ ఆడాడు. మొత్తం 71 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ తొలి సీజన్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. 2008 సీజన్లో అతడు ఏకంగా 616 పరుగులు చేశాడు. అందుకే షాన్ మార్ష్‌ను ఐపీఎల్ ఫస్ట్ సూపర్ స్టార్ అని కూడా అంటుంటారు.
-
Shaun Marsh has announced his retirement from professional cricket.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
- The first superstar of the IPL...!!! pic.twitter.com/GYK5OJmwbE
">Shaun Marsh has announced his retirement from professional cricket.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2024
- The first superstar of the IPL...!!! pic.twitter.com/GYK5OJmwbEShaun Marsh has announced his retirement from professional cricket.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 14, 2024
- The first superstar of the IPL...!!! pic.twitter.com/GYK5OJmwbE
అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20 : సిరీస్ పట్టేయాలన్న లక్ష్యంతో భారత్