ETV Bharat / sports

'ఇంగ్లాండ్​ పర్యటనకు శార్దూల్ అందుకే​'

ఇంగ్లాండ్​ పర్యటనకు శార్దూల్​ ఠాకూర్​ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని బౌలింగ్​ కోచ్​ భరత్​ అరుణ్ వెల్లడించాడు​. పేస్​ ఆల్​రౌండర్​గా శార్దూల్ సత్తా చాటాడని, అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని చెప్పాడు.

sardul
శార్దూల్​
author img

By

Published : May 12, 2021, 5:09 PM IST

ప్రముఖ ఆటగాడు హార్దిక్​ పాండ్య బౌలింగ్​ చేయలేకపోవడం వల్లే ఇంగ్లాండ్​ పర్యటనకు అతడిని పక్కనపెట్టినట్లు చెప్పాడు టీమ్ఇండియా బౌలింగ్​ కోచ్​ భరత్​ అరుణ్​. ఆల్​రౌండర్​గా శార్దూల్​ ఠాకూర్​ తానేంటో నిరూపించుకున్నాడని.. అందుకే హార్దిక్​కు బదులు అతడిని ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.

"హార్దిక్​కు మించిన ఆటగాడిని వెతికి పట్టుకోవడం చాలా కష్టం. అతడిలో అసాధారణమైన ప్రతిభ ఉంది. కానీ దురదృష్టవశాత్తు వెన్నుముక శస్త్రచికిత్స వల్ల బౌలింగ్​ చేయలేకపోతున్నాడు. 2018లో అతడు చివరిసారిగా ఇంగ్లాండ్​పై ఆడిన టెస్టు క్రికెట్​లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏదేమైనప్పటికీ అతడిపై ఒత్తిడి తగ్గించి తిరిగి కోలుకునేలా చేయాలి. అతడికి ప్రత్యామ్నయంగా ఆల్​రౌండర్లను సెలక్టరను గుర్తించడం పెద్దపని. ఆ తర్వాత వారిని మేం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. శార్దూల్​ విషయానికొస్తే అతడు మంచి ఆల్​రౌండర్​ అని నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్​ ఆల్​రౌండర్​గా ఎదగాలని పట్టుదలతో ఉన్నట్లు అంతకుముందు చెప్పాడు. జట్టుకు కూడా ఫాస్ట్​ బౌలింగ్ ఆల్​రౌండర్​ ఎంతో అవసరం. కాబట్టి అతడిని ఆ విధంగా తీర్చుదిద్దుతాం. ఇంగ్లాండ్​ పర్యటనలో తన అవకాశాన్ని ఉపయోగించుకుంటాడని భావిస్తున్నాను"

-భరత్​ అరుణ్​, టీమ్ఇండియా బౌలింగ్ కోచ్​.

జట్టులో ఉన్న ఆరుగురు ఫాస్ట్​ బౌలర్లను రొటేషన్​ విధానం ద్వారా ఆడిస్తారని చెప్పాడు అరుణ్​. దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని అన్నాడు. వారిపై ఒత్తిడి కూడా తగ్గుతుందని వెల్లడించాడు.

ఇదీ చూడండి: మన కుర్రాళ్లు... జోరుమీదున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.