ETV Bharat / sports

ఎంసీజీ వేదికగా స్పిన్​ దిగ్గజానికి తుది వీడ్కోలు.. ఎప్పుడంటే? - షేన్​ వార్న్

Shane Warne Funeral: మార్చి 30న షేన్ వార్న్​​​ వీడ్కోలు సభను మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో నిర్వహించనున్నారు. వార్న్​ సంతాప సభకు ఎంసీజీ వేదిక సరైందని విక్టోరియా స్టేట్​ ప్రీమియర్​ డేనియల్​ ఆండ్రూస్​ అన్నారు.

Shane Warne
షేన్​ వార్న్
author img

By

Published : Mar 9, 2022, 7:00 PM IST

Shane Warne Funeral: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ షేన్​ వార్న్​ వీడ్కోలు సభను మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్(ఎంసీజీ)​లో నిర్వహించనున్నారు. మార్చి 30న ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు విక్టోరియా స్టేట్​ ప్రీమియర్​ డేనియల్​ ఆండ్రూస్​ వెల్లడించారు. వార్న్​ సంతాప సభకు ఎంసీజీ వేదిక సరైందన్నారు. ఎంసీజీ సభకు ముందే వార్న్​ అంత్యక్రియలు ఉంటాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు. "షేన్​వార్న్​ వీడ్కోలు సభకు ఎంసీజీ కన్నా సరైన స్థలం ప్రపంచంలో మరొకటి లేదు" అని ఆండ్రూస్ బుధవారం ట్వీట్​ చేశారు.

మెల్​బోర్న్​ క్రికెట్​ మైదానం వార్న్​కు చాలా ప్రత్యేకమైనది. 1994లో ప్రతిష్ఠాత్మక యాషెస్​ సిరీస్​లో హ్యాట్రిక్​, 2006లో బాక్సింగ్​ డే రోజున తీసిన 700వ టెస్ట్​ వికెట్, రిటైర్మెంట్​కు ముందు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇక్కడే ఆడాడు.​ వార్న్​ మెల్​బోర్న్​లోనే పుట్టి పెరిగాడు.

52 ఏళ్ల షేన్ వార్న్​ గుండెపోటుతో గతవారం థాయ్​లాండ్​లో మరణించాడు. వార్న్​ శవపరీక్ష ఫలితాల్లో ఎలాంటి అనుమానస్పద ఆనవాళ్లు లేకపోవడం వల్ల సహజ మరణంగా నిర్థారించారు. వార్న్​ భౌతికకాయాన్ని థాయ్​లాండ్​లోని కో సముయ్​ ఐస్​లాండ్​ నుంచి సూరత్​థానీ భూభాగానికి ఆదివారం తరలించారు. అక్కడ నుంచి సోమవారం రాత్రి థాయ్​లాండ్​ రాజధాని బ్యాంకాక్​కు తీసుకెళ్లారు.

బ్యాంకాక్​ నుంచి మెల్​బోర్న్​కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వార్న్​ మరణించిన మార్చి 4 రాత్రిని 'ముగింపులేని ఓ పీడకలగా' అభివర్ణించింది వార్న్​ కుటుంబం.

ఇదీ చదవండి: Test Rankings 2022: టెస్ట్​ ర్యాంకింగ్స్​లో అతడే నెం. 1

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.