ETV Bharat / sports

'నేను యుద్ధంలో ఉన్నాను, అవన్నీ పట్టించుకోను'- టైమ్​డ్​ ఔట్​పై ముదిరిన వివాదం! - బంగ్లా వర్సెస్ శ్రీలంక వన్డే వరల్డ్​కప్​ 2023

SL Vs BAN Timed Out Controversy : 2023 వరల్డ్​కప్​ సందర్భంగా సోమవారం శ్రీలంక, బంగ్లాదేశ్​ మధ్య జరిగిన టైమ్​డ్ ఔట్​ వివాదం ముదురుతోంది. దీనిపై బంగ్లాదేశ్​ కెప్టెన్​ షకీబ్​ స్పందించాడు. తాను యుద్ధంలో ఉన్నట్లు.. ఆ సమయంలో తనకు ఏది మంచిదనిపిస్తే అదే చేసినట్లు చెప్పాడు. షకీబ్​ వ్యాఖ్యలకు మాథ్యూస్​ గట్టి కౌంటర్​ ఇచ్చాడు. ఇంతకీ మాథ్యూస్ ఏమన్నాడంటే?

SL Vs BAN Timed Out Controversy
SL Vs BAN Timed Out Controversy
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 11:08 AM IST

Updated : Nov 7, 2023, 11:51 AM IST

SL Vs BAN Timed Out Controversy : 2023 వరల్డ్​కప్ లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్​ మ్యాచ్​లో జరిగిన మ్యాచ్​లో శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్​ టైమ్​డ్ ఔట్​ అయ్యాడు. ఇప్పుడీ వివాదం మరింత ముదురుతోంది. ఇరు జట్ల ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాథ్యూస్​ను అంపైర్​ టైమ్​డ్ ఔట్​గా ప్రకటించడం పట్ల బంగ్లా కెప్టెన్ షకీబ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నేను యుద్ధంలో ఉన్నాను..'
ఈ విషయంపై మ్యాచ్​ తర్వాత బంగ్లా కెప్టెన్ షకీబ్​ స్పందించాడు. తాను యుద్ధంలో ఉన్నట్లు భావించానని.. అందుకే తనకు అనిపించింది తాను చేయాల్సి వచ్చిందన్నాడు. ఈ విషయంపై ఎన్నో విమర్శలు వస్తాయని అవన్నీ తాను పట్టించుకోనని చెప్పాడు. అయితే తమ విజయానికి టైమ్డ్ ఔట్ సాయం చేసిందని తెలిపాడు. ఇందులో దాచడానికి ఏమీ లేదని షకీబ్​ స్పష్టం చేశాడు.

'అది సిగ్గుచేటు..'
అయితే షకీబ్​ చేసిన వ్యాఖ్యలకు మాథ్యూస్​ కౌంటర్ ఇచ్చాడు. బంగ్లాదేశ్​, ఆ టీమ్​ కెప్టెన్​కు ఇది సిగ్గు చేటు అని అన్నాడు. క్రికెట్ ఇలా ఆడాలని అనుకోవడం, దానికోసం ఇంతలా దిగజారడం చూస్తుంటే ఏదో తప్పు జరిగిందని అనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'నేను క్రీజులోకి రెండు నిమిషాల్లోపే వచ్చాను. హెల్మెట్ విరగడం చూసిన సమయంలోనూ ఇంకా ఐదు సెకన్ల టైమ్ మిగిలి ఉంది. ఇలాంటి సమయాల్లో కామన్‌సెన్స్​తో ఆలోచించాలి. నేను మన్కడింగ్ లేదంటే ఫీల్డింగ్​కు అడ్డంకిగా ఉండలేదు. కొంచెం కామన్‌సెన్స్​తో ఆలోచిస్తే సరిపోయేది' అని మాథ్యూస్ అన్నాడు. ఆ తర్వాత తాను 5 సెకన్ల ముందే క్రీజులోకి వచ్చానని ట్వీట్టర్​లో ఓ పోస్ట్ పెట్టాడు. దానికి టైమ్​ స్టాంప్​ ఉన్న ఫొటోను జతచేశాడు.

ఇదీ జరిగింది..
శ్రీలంక బ్యాటర్​ సధీర సమరవిక్రమ 24.2 ఓవర్​లో షకీబ్ బౌలింగ్​ ఔట్​ అయిన తర్వాత.. ఆల్​రౌండర్ మాథ్యూస్ బ్యాటింగ్​కు రావాల్సి ఉంది. ఈ క్రమంలో మాథ్యూస్.. దాదాపు దాదాపు 120 సెకన్ల తర్వాత క్రీజులోకి వచ్చాడు. అయితే బ్యాటర్ క్రీజులోకి ఆలస్యంగా వచ్చాడంటూ.. అతడ్ని టైమ్​డ్‌ ఔట్​గా ప్రకటించాలని బంగ్లా ఆటగాళ్లు అప్పీల్‌ చేశారు. దీంతో మాథ్యూస్​పై టైమ్​డ్​ ఔట్​​ వేటు వేశారు అంపైర్లు. అయితే తాను ధరించే హెల్మెట్‌ పట్టీలు బాగా లేవని.. దానిని మార్చుకునే క్రమంలోనే బ్యాటింగ్​కు రావడం ఆలస్యమైందని మాథ్యూస్‌ మైదానంలో ఉన్న అంపైర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతడి వాదనను అంపైర్లు​ ఎరాస్మస్​, రిచర్డ్​ ఇల్లింగ్​వర్త్​​ పట్టించుకోలేదు. దీంతో మాథ్యూస్​ బ్యాటింగ్​ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

  • Year in which the first dismissal took place:

    Caught -1877
    Bowled -1877
    Run Out - 1877
    LBW - 1877
    Stumped - 1877
    Hit Wicket - 1884.
    Retired Hurt - 1877.
    Obstructing Field - 1951.
    Handling ball - 1957.
    Retired Out - 2001.
    Hitting ball twice - 23
    Timed out - 2023(Angelo Mathhews) pic.twitter.com/2yI9AMQmoK

    — Sumit Arora (@kingsumitarora) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2 బెర్త్​లు 4 జట్లు- ఉత్కంఠగా వరల్డ్​కప్​ సెమీస్​ రేస్​, భారత్​తో తలపడేదెవరు?

బంగ్లా చేతితో శ్రీలంక చిత్తు - ఎట్టకేలకు టోర్నీలో రెండో విజయం

Last Updated : Nov 7, 2023, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.