మహిళల టీ20 క్రికెట్ ర్యాంకింగ్స్‌లో(ICC Women's T20 Rankings) భారత స్టార్ బ్యాట్స్‌వుమన్ షెఫాలీ వర్మ తొలి స్థానంలో కొనసాగుతుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన ఆల్‌రౌండర్ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన సూఫీ డేవైన్ టాప్ 1గా నిలిచింది.
బ్యాటింగ్ ర్యాంకుల్లో 759 పాయింట్లతో షెఫాలీ వర్మ(Shafali Verma Ranking) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన బేత్ మూనీ(744), మూడో ర్యాంకులో టీమ్ఇండియా టీ20 వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana T20 Ranking) నిలిచింది.
ఆల్‌రౌండర్ల జాబితాలో..
టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలోని నాలుగో ర్యాంకులో టీమ్ఇండియాకు చెందిన దీప్తి శర్మ నిలవగా.. ఆ తర్వాతి 5, 6 స్థానాల్లో ఎల్లిసే పెర్రీ(ఆస్ట్రేలియా), హేలీ మ్యాథ్యూస్(వెస్టిండీస్) ఉన్నారు. మరో వెస్టిండీస్ క్రికెటర్ స్టఫెనీ టైలర్ మూడు స్థానాలకు దిగి.. 7వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
బౌలింగ్‌లో..
బౌలింగ్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ స్కాట్ 2 స్థానాలను మెరుగుపరుచుకొని.. రెండో ర్యాంక్‌కు చేరుకుంది. ఆసీస్‌కు చెందిన జెస్ జోనాసెన్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టీమ్ఇండియాకు చెందిన దీప్తి శర్మ 6వ ర్యాంకులో ఉండగా.. పూనమ్ యాదవ్ 8వ స్థానానికి చేరింది.
ఇదీ చూడండి.. టీ20 ప్రపంచకప్‌లో ధావన్‌కు ఛాన్స్ దక్కేనా!