ETV Bharat / entertainment

'వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత - SAMANTHA ABOUT DIVORCE

తన వెడ్డింగ్ గౌన్ రీమోడల్​, విడాకుల విషయంపై స్పందించిన హీరోయిన్ సమంత.

Samantha About Divorce
Samantha About Divorce (thumbnail source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 8:30 AM IST

Samantha About Divorce : హీరోయిన్ సమంత సందర్భం వచ్చినప్పుడల్లా తన విడాకులు, ఎదుర్కొన్న మయోసైటిస్‌ వ్యాధి గురించి మాట్లాడుతూనే ఉంటుంది. అయితే దీనిపై చాలా సార్లు ట్రోల్స్​ వస్తూనే ఉంటాయి. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఆమె సింపతీ కోసమే దాని గురించి మాట్లాడుతుంటుంది అని కామెంట్లు చేస్తుంటారు. అయినా కూడా సామ్ వాటిపై ప్రతీసారి స్పందిస్తూనే ఉంటుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఈ విషయాల్ని లేవనెత్తింది. తాను విడాకులు తీసుకున్న సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ గురించి మాట్లాడింది. మహిళలు ఎదుర్కొనే సామాజిక సవాళ్ల గురించి ప్రస్తావించింది. ఇద్దరి మధ్య బంధం విడిపోతే, మొదటగా అమ్మాయిలనే నిందిస్తారని సామ్ చెప్పారు. దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని అసహనం వ్యక్తం చేసింది. తనపై ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది.

విడాకుల గురించి సామ్ మాట్లాడుతూ - "డివొర్స్‌ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు, మహిళలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్​ ఇస్తుంది. సెకండ్‌ హ్యాండ్‌, ఆమె జీవితం ఇక వేస్ట్, యూజ్డ్‌ అని ఎందుకు ట్యాగ్స్‌ ఎందుకు తగిలిస్తారో తెలీదు. నాకైతే అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని ఈ ట్యాగ్స్​, విమర్శలు ఎంతగానో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న సదరు మహిళను, అమ్మాయిని ఇవి మరింత ఎక్కువగా నిరాశ పరుస్తాయి. నా గురించి కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవి అబద్ధాలు, అందుకే వాటి గురించి మాట్లాడాలని ఎప్పుడూ అనుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుం బసభ్యులు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు" అని సామ్ పేర్కొంది.

అదీ ప్రతీకారం కాదు(Samantha Wedding Gown Revenge) - సమంత తన పెళ్లి గౌనును రీ మోడల్‌ చేయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. సమంత కావాలనే అలా చేసిందని, ప్రతీకారం తీర్చుకుంటుంది అని చాలా మంది విమర్శించారు. దాని గురించి సామ్ మాట్లాడుతూ "నా పెళ్లి గౌను రీ మోడల్‌ చేయాలని డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా బాధపడ్డా. ఆ గౌను రీ డిజైన్‌ చేసి, నేను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. నా లైఫ్​లో జరిగిన సంఘటనలను నేనెప్పుడూ దాచాలనుకోలేదు. ఎన్నో కష్టమైన దశలు దాటుకొని వచ్చాను. అది బలానికి ప్రతీక మాత్రమే. నా జీవితం అక్కడితో ముగిసిపోయిందని మాత్రం కాదు. ఎక్కడైతే ముగుస్తుందో అక్కడే తిరిగి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను" అని చెప్పారు.

'మిమ్మల్ని పురుషులు అవమానిస్తే అలా చేయండి' - ఆడవారికి సమంత సూక్తులు

పెళ్లి విషయంలో అటువంటి నిర్ణయం తీసుకున్న చైతూ, శోభిత! - ఆ కోలీవుడ్ జంట దారిలోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.