మహిళా క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. మొత్తం కాంట్రాక్టు క్రికెటర్ల సంఖ్యను 22 నుంచి 19కి తగ్గించింది. యువ బ్యాటింగ్ సంచలనం షెఫాలీ వర్మ సి నుంచి బి గ్రేడ్‌కు ఎదిగింది. అన్ని ఫార్మాట్లలో ఆడే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్‌ను గ్రేడ్ ఎ లో కొనసాగించింది. కాంట్రాక్ట్ కింద వీరు రూ.50 లక్షలు పొందుతారు.
షెఫాలీ, మిథాలీరాజ్, దీప్తి శర్మ సహా 10 మంది గ్రేడ్ బి లో ఉన్నారు. రిచా ఘోష్‌కు గ్రేడ్ సి లో చోటు దక్కింది. గ్రేడ్ బి క్రికెటర్లకు రూ. 30 లక్షలు, సి లో ఉన్న వారికి రూ.10 లక్షలు అందుతాయి. వేద కృష్ణమూర్తి, ఏక్తా బిష్ఠ్‌కు కాంట్రాక్టులు దక్కలేదు.
గ్రేడ్ ఎ: హర్మన్‌ప్రీత్, స్మృతి, పూనమ్
గ్రేడ్ బి: మిథాలీ, జులన్, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేశ్వరి, షెఫాలీ, రాధ, శిఖ, తానియా, జెమీమా
గ్రేడ్ సి: మాన్సీ జోషి, అరుంధతి, పూజ, హర్లీన్ డియోల్, ప్రియా పునియా, రిచా ఘోష్.