వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు(T20 worldcup 2022) వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్‌లను ఆస్ట్రేలియాలోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు. వీటిలో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్ ఉన్నాయి(T20 worldcup venues). 45 మ్యాచ్‌లతో కూడిన ఈ మెగాటోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబరు 13వరకు జరగనుంది(T20 worldcup schedule). నవంబరు 9, 10 తేదీల్లో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లను సిడ్నీ, అడిలైడ్ వేదికగా జరగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు.
ఇటీవల ముగిసిన 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు నేరుగా సూపర్-12లో అడుగుపెడతాయి. మరోవైపు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు టాప్-8 ర్యాంకుల్లో ఉన్నందున ఇవి కూడా సూపర్-12కు నేరుగా చేరుకుంటాయి. శ్రీలంక, వెస్టిండీస్ జట్లు మాత్రం మిగతా చిన్న జట్లతో అర్హత పోటీల్లో తలపడతాయి. ఈ అర్హత పోటీలను రెండు దశల్లో నిర్వహిస్తుండగా.. తొలుత ఫిబ్రవరిలో ఒమన్‌లో ఒక టోర్నీ.. తర్వాత జూన్‌లో జింబాబ్వేలో మరో టోర్నీ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: 'కేన్ మామ.. వార్నర్ కాకా'.. రషీద్ ట్వీట్ వైరల్