ETV Bharat / sports

Senanayake Arrest : ప్రముఖ క్రికెటర్​ అరెస్ట్​.. అదే కారణమా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 2:55 PM IST

Updated : Sep 7, 2023, 11:57 AM IST

Senanayake Arrest : శ్రీలంక మాజీ ఆటగాడు సచిత్ర సేననాయకేను బుధవారం శ్రీలంక పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ వివరాలు..

Senanayake Arrest
Senanayake Arrest

Senanayake Arrest : శ్రీలంక మాజీ ఆటగాడు సచిత్ర సేననాయకే మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాల్లో చిక్కుకున్నాడు. అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. బుధవారం శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ దర్యాప్తు బృందానికి లొంగిపోయాడు. అనంతరం దర్యాప్తు బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇదివరకే దర్యాప్తు ప్రారంభించిన కొలంబో కోర్టు.. మూడు వారాల కిందటే దేశాన్ని విడిచి వెళ్లరాదంటూ అతడ్ని ఆదేశించింది. ఇక 15 రోజుల పాటు సేననాయకె పోలీసుల అదుపులో ఉంటాడు.

  • Update: Former cricketer Sachithra Senanayaka who was arrested after he surrendered to the Special Investigation Unit of the Sports Ministry produced before Colombo Magistrates court:- Hiru #LKA https://t.co/FkTMt8Atyk

    — Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ కేసు.. 2020 లంక ప్రీమియర్ లీగ్​లో కొన్ని మ్యాచ్​ల్లో ఫిక్సింగ్​కు పాల్పడినట్లు సేననాయకేపై ఆరోపణలు ఉన్నాయి. దుబాయ్​కు చెందిన ఇద్దరు వ్యక్తులతో సేననాయకే.. నిబంధనలకు విరుద్ధంగా సంప్రదింపులు జరిపాడని అతడిపై ఉన్న ప్రధాన ఆరోపణ. 38 ఏళ్ల సేననాయకె 2012-2016 మధ్య కాలం శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Senanayake International Career : అతడి కెరీర్​లో ఒక టెస్టు, 49 వన్డేలు, 24 టీ20 అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడాడు. వన్డేల్లో 53 వికెట్లు నేలకూల్చిన సేననాయకె, టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఇక 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్) లో అతడు కోల్​కతా నైట్​రైడర్స్ (కేకేఆర్) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్​లో 8 మ్యాచ్​లు ఆడిన సేననాయకె.. 9 వికెట్లు తీశాడు. శ్రీలంక ప్రీమియర్ లీగ్​లో సేననాయకె బస్నహిరా గ్రీన్స్, వెస్టర్న్ ట్రూపర్స్ జట్ల తరఫున ఆడాడు.

Asia Cup 2023 Super 4 : 2023 ఆసియా కప్​లో శ్రీలంక.. లీగ్​ దశలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లపై విజయం సాధించి నాలుగు పాయింట్లతో టాప్​లో నిలిచింది. దీంతో నేరుగా సూపర్​ 4కు అర్హత సాధించింది. ఇక సెప్టెంబర్ 9న శ్రీలంక, బంగ్లాదేశ్​తో మరోసారి తలపడనుంది. తర్వాత సెప్టెంబర్ 12న శ్రీలంక-భారత్ మధ్య మ్యాచ్​ జరగనుంది. అయితే ఇప్పటివరకూ జరిగిన 15 ఆసియా కప్​ సీజన్​లలో శ్రీలంక ఆరు సార్లు విజేతగా నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఏడు (6 వన్డే ఫార్మాట్, 1 టీ20 ఫార్మాట్) విజయాలతో ప్రథమ స్థానంలో ఉంది. ​

Asia Cup 2023 Sl vs Ban : తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. లో స్కోరింగ్​ మ్యాచ్​లో శ్రీలంక ఈజీ విన్..

Wanindu Hasaranga Retirement : శ్రీలంకకు మరో షాక్​.. ఆ ఫార్మాట్​కు ఆల్​రౌండర్ హసరంగ గుడ్​బై

Last Updated : Sep 7, 2023, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.