ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడిని సారథిగా తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో అసలు ఏం జరుగుతుంది అని తోటి క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్‌లోనూ గందరగోళం నెలకొంది.
అయితే కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని బీసీసీఐలో ఉన్న వారందరూ అడిగారని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ వెల్లడించారు. కానీ అతడు వినలేదని పేర్కొన్నారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా.. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలిచింది. మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ తలపడనుంది.
కోహ్లీ స్థానంలో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించారు. కానీ అతడికి తొడ కండరాలు గాయం ఇంకా తగ్గలేదు. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలానే 18 మందితో కూడిన జట్టును కూడా శుక్రవారం ప్రకటించారు.
ఇవీ చదవండి: