ETV Bharat / sports

ఇంగ్లాండ్‌ కవ్వింపులు- విజయాలతో భారత్ బదులు - ఫ్లింటాఫ్ యువీ స్లెడ్జింగ్

క్రికెట్​లో స్లెడ్జింగ్ అనేది సాధారణమైన విషయం. అది ఒక పరిమితి వరకైతే ఫర్వాలేదు కానీ.. శ్రుతి మించితే టీమ్​ఇండియా బదులు వేరేలా ఉంటుంది. తాజాగా ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో ఇలాంటి సంఘటనే జరిగింది. గతంలోనూ ఇంగ్లాండ్​ ఆటగాళ్లు భారత క్రికెటర్లపై నోరు పారేసుకోగా.. టీమ్ఇండియా మాత్రం విజయాలతోనే సమాధానం చెప్పింది.

england vs india
ఇంగ్లాండ్ vs ఇండియా
author img

By

Published : Aug 22, 2021, 12:03 PM IST

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఏ క్రికెట్‌ మ్యాచ్‌ అయినా రసవత్తరంగా ఉంటుంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన ఆటగాళ్లుంటారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఈ క్రమంలోనే పలుమార్లు క్రికెటర్లమనే సంగతి మరిచిపోయి నోటికి పనిచెప్తారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ ప్లేయర్లు ఇష్టమొచ్చినట్లు దూషిస్తారు. అవి ఒక పరిమితి వరకైతే ఫర్వాలేదు కానీ.. శ్రుతి మించితే టీమ్‌ఇండియా నుంచి దీటైన సమాధానం ఉంటుంది. తాజాగా జరిగిన రెండో టెస్టులోనూ ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. దీంతో గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన కొన్ని వివాదాస్పద సంగతులు గుర్తుచేసుకుందాం.

రెచ్చగొట్టిన ఫ్లింటాఫ్‌.. దంచికొట్టిన యువీ

india vs england scariest incidents
యువీ మెరుపులు

2007 టీ20 ప్రపంచకప్‌ దాదాపు అందరికీ గుర్తుండి ఉంటుంది. సెమీస్‌కు ముందు ఇంగ్లాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ రెచ్చిపోయాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు సంధించి భారత క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు పీడకల మిగిల్చాడు. అయితే, యువీ అలా రెచ్చిపోవడానికి కూడా ఓ కారణం ఉందనే సంగతి కొందరికి తెలిసే ఉంటుంది. మాజీ ప్లేయర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ అంతకుముందు ఓవర్లో యువరాజ్‌ను పీక కోస్తా అని అన్నాడు. దీంతో రెచ్చిపోయిన భారత బ్యాట్స్‌మన్‌ తర్వాతి ఓవర్‌లో బ్రాడ్‌ను చితకబాదాడు. అప్పుడు ఫ్లింటాఫ్‌ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే ఆ రికార్డు నమోదయ్యేది కాదేమో!

అండర్సన్ బూతులు.. జడేజాకు కోతలు‌

india vs england scariest incidents
జడేజాను నెట్టేస్తున్న అండర్సన్

ఇక 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇంగ్లాండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌.. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను బూతులు తిట్టాడు. తొలి టెస్టు రెండో రోజు భోజన విరామ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లేటప్పుడు జడ్డూను వెనక్కిలాగిన ఇంగ్లిష్‌ పేసర్‌.. పరుష పదాలు ఉపయోగించి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపో అంటూ బెదిరించాడు. భోజన విరామం అనంతరం కూడా అండర్సన్‌ తనని దూషించాడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. ఈ సంఘటనపై ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. చివరికి ఐసీసీ కలగజేసుకొని విచారణ జరిపి సరైన సాక్ష్యాలు లేవని జడ్డూకే మ్యాచ్‌ ఫీజ్‌లో 50 శాతం కోత విధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో అంపైర్‌ ఆక్సెన్‌ఫర్డ్‌ సైతం పలుమార్లు అండర్సన్‌ బూతు మాటలు పలకడం విన్నానని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

స్టోక్స్‌ మాటలు.. కోహ్లీ తూటాలు

india vs england scariest incidents
స్టోక్స్​తో కోహ్లీ

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా బెన్‌స్టోక్స్‌ టీమ్‌ఇండియా ఆటగాళ్లపై నోరుపారేసుకున్నాడు. నాలుగో టెస్టు తొలి రోజు స్టోక్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఓ బంతి బౌన్సర్‌గా వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన అతడు సిరాజ్‌ను ఏవో మాటలన్నాడు. అయినా, సిరాజ్‌ తిరిగి స్పందించకుండా బౌలింగ్‌ చేశాడు. అదే సమయంలో కెప్టెన్‌ కోహ్లీ కలగజేసుకొని స్టోక్స్‌తో మాట్లాడటానికి ప్రయత్నించాడు. రెచ్చిపోయిన ఇంగ్లిష్‌ ఆల్‌రౌండర్‌ మరిన్ని మాటలన్నాడు. కోహ్లీ కూడా అంతే దీటుగా మాటలతూటాలు పేల్చాడు. అయితే, అంపైర్లు కలగజేసుకొని ఇద్దరినీ సముదాయించారు. దీంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడమే కాకుండా 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.

బట్లర్‌ నోరుజారి.. కోహ్లీకి కోపమొచ్చి

india vs england scariest incidents
కోహ్లీ- బట్లర్

అదే పర్యటనలో ఇరు జట్ల మధ్య జరిగిన ఐదో టీ20లోనూ మరో ఇంగ్లాండ్‌ బ్యాట్స్​మన్​ జోస్‌ బట్లర్‌.. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో మాటల యుద్ధానికి దిగాడు. తొలుత అతడు ఏవో మాటలన్నా కోహ్లీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ విజయం వైపు పరుగెడుతున్న సమయంలో భువి వేసిన 13వ ఓవర్‌లో బట్లర్‌(52) ఔటయ్యాడు. దీంతో మ్యాచ్‌ భారత్‌వైపు మళ్లింది. అదే సమయంలో బట్లర్‌ ఏదో అనుకుంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌ బాటపట్టాడు. దీంతో కోహ్లీ కూడా కోపంలో దీటుగా స్పందించాడు. ఈ క్రమంలోనే బట్లర్‌ తిరిగి పిచ్‌వైపు రావడానికి చూడగా కోహ్లీ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించి పొట్టి కప్పును కూడా ఎగరేసుకుపోయింది.

అండర్సన్‌తో మొదలై.. భారత్‌ గెలిచేదాకా

india vs england scariest incidents
అంపైర్​కు ఫిర్యాదు చేస్తున్న బుమ్రా
india vs england scariest incidents
టీమ్ఇండియా గెలుపు సంబరం

ఇక తాజాగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులోనూ ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు బుమ్రా పలుమార్లు షార్ట్‌పిచ్‌ బంతులు వేశాడు. దాంతో ఇబ్బంది పడిన అతడు ఇలా బంతులెందుకు వేస్తున్నావని అడిగాడు. అనంతరం ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక బుమ్రా వెళ్లి అతడికి క్షమాపణలు చెప్పాలని చూసినా బూతులు తిడుతూ అవమానించాడని తెలిసింది. అంతకుముందు రోజు కూడా టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో అండర్సన్‌, కోహ్లీల మధ్య మాటలు పేలాయి. ఇంగ్లిష్‌ పేసర్‌ పిచ్‌ మధ్యలో పరుగెత్తడం గమనించిన కోహ్లీ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అండర్సన్‌ ఏవో మాటలన్నాడు. కోహ్లీ కూడా అదే స్థాయిలో జవాబిచ్చాడు. ఇక చివరి రోజూ బుమ్రా బ్యాటింగ్‌ చేసేటప్పుడు మార్క్‌వుడ్‌ దూషించాడు. ఆ విషయంపై బుమ్రా అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో బట్లర్‌ కలగజేసుకొని బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది.

ఇవీ చదవండి:

ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆసీస్​ స్వలింగ క్రికెటర్ జంట

ఉన్ముక్త్​.. రెండేళ్ల నుంచి ఒక్క మ్యాచ్​ కూడా ఆడలేదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.