Sanju Samson Ireland T20 : విండీస్ పర్యటన ముగిసింది. ఇక రానున్న టీ20 సిరీస్ కోసం టీమ్‌ఇండియా సర్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఆరంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐరిష్ జట్టుతో పోటీపడేందుకు బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ఐర్లాండ్‌కు పయనమైంది. అయితే ఇప్పుడున్న జట్టులో చాలా వరకు కొత్త ఆటగాళ్లే ఉన్నారు. వీరందరూ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే చాలా అవకాశాలను వృథా చేసుకున్న సంజు శాంసన్‌ను ఈ సిరీస్‌లో ఆడిస్తారా? లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
Jitesh Sharma Ireland T20 : ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ.. సంజూ స్థానంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో జరగనున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడింట్లో బ్యాటింగ్ చేసిన శాంసన్.. ఆ సిరీస్‌లో వరుసగా 12, 7, 13 పరుగులు మాత్రమే స్కోర్ చేయగలిగాడు. మరోవైపు విండీస్‌తో జరిగిన సిరీస్‌లో వికెట్లు తీయడంలోనూ సంజూ ఉత్తమంగా రాణించలేదు. దీంతో ఐర్లాండ్‌తో జరగనున్న సిరీస్‌లో అతనికి బదులు జితేశ్ శర్మ ఆడించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
29 ఏళ్ల మహారాష్ట్ర ఆటగాడు జితేశ్.. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడి అద్భుతంగా రాణించాడు. వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో పాటు 5 లేదా 6 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఫినిషర్ పాత్ర పోషించాడు. ఆసియా క్రీడల్లో జితేశ్‌ను ఆడించేందుకు జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్న తరుణంలో.. అంతకంటే ముందు అతనికి అంతర్జాతీయ అనుభవం కోసం ఐర్లాండ్‌తో మ్యాచ్‌ల్లో బరిలో దింపొచ్చు. ఒకవేళ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం రింకు సింగ్, జితేశ్‌లో ఒకరికి అవకాశం పోయినట్లే.
ఓ సారి రికార్డులు చూస్తే..
Sanju Samson Records : ప్రతిష్టాత్మక ఐపీఎల్‌లో 3800పైగా పరుగులతో రాణించిన శాంసన్.. అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం తన సత్తా చాటలేకపోతున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ ప్లేయర్.. 18.62 సగటుతో కేవలం 333 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ క్రమంలో అతడికి ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
GT vs RR : సంజు-హెట్మెయర్ బాదుడే బాదుడు.. మ్యాచ్ హైలైట్ షాట్స్ చూశారా?
IPL 2023 : అశ్విన్‌కు బిగ్ షాక్.. 25% ఫీజు కట్.. సంజూ కామెంట్స్ వైరల్!